కురుపాం: జగనన్న అమ్మ ఒడి - ....బతుకులు మార్చే గుడి అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం లో బటన్ నొక్కి జమ చేసే కార్యక్రమాన్నిసీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి, విద్యార్ధులు మాట్లాడారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే…వారి మాటల్లోనే అందరికీ నమస్కారం, సీఎంగారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం సంతోషకరం, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు నా అభినందనలు. ఏ విద్యార్ది కూడా ఆర్ధిక పరిస్ధితుల వల్ల చదువుకు దూరం కాకూడదని ఎన్నికల ముందే చెప్పారు, అధికారంలోకి రాగానే అమలుచేస్తున్నారు. దేశంలోనే విద్యాపరంగా సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచస్ధాయిలో నిలబడేలా తీర్చిదిద్దారు, దేశమంతా ఏపీ వైపు చూస్తుంది, మేం ఎందుకు చేయలేకపోతున్నామా ఏపీలో ఏం చేస్తున్నారని గమనిస్తున్నారు, కేరళ, ఢిల్లీ గురించే మాట్లాడేవారు ఇప్పుడు ఏపీ గురించి చెప్పుకుంటున్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్, పిల్లలకు ట్యాబ్లు, నైపుణ్యం పెంపు ఇలా ఒకటేమిటి, విద్య కోసం ఖర్చుపెడుతున్నది సంక్షేమం కాదు, పెట్టుబడి. సత్య నాదెళ్ళలాంటి వారు ఎంతోమంది తయారవ్వాలని సీఎంగారు తపన పడుతున్నారు. విద్యార్ధులు నేటి విద్యార్ధులుగా తయరయి, దేశ భవిష్యత్కు వెన్నెముకలాగా ఉండాలని, మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మరింతగా చదువుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎస్.మనస్విని, తొమ్మిదో తరగతి విద్యార్ధిని, కేజీబీవీ గుమ్మలక్ష్మీపురం గుడ్ మార్నింగ్ సార్, నేను ఒక మారుమూల గిరిజన ప్రాంతంలో ఎస్టీ కులానికి చెందిన సింగిల్ పేరెంట్ చైల్డ్ను. సార్ నేను ముందునుంచి తెలుగు మీడియంలో చదువుకున్నాను, కానీ ఇప్పుడు జగన్ మామయ్య ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాను. జగన్ సార్ అనేక పథకాలు ప్రవేశపెట్టారు, సార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు, మా విద్యార్ధులకు, విద్యా వ్యవస్ధకు ఉపయోగపడే పథకాలు అనేకం తీసుకొచ్చారు. జగనన్న అమ్మ ఒడి అద్భుతమైన పథకం, దీని వల్ల నాలాంటి అనేక పేద, మధ్యతరగతి కుటుంబాలు చక్కగా చదువుకునేందుకు దోహదపడుతుంది. ఆ క్రెడిట్ మీదే సార్, జగనన్న విద్యాకానుకలో చక్కటి బుక్స్ అన్నీ ఇస్తున్నారు, నాడు నేడు పథకం కింద మా స్కూల్ లో చాలా మార్పులు వచ్చాయి, జగనన్న ఆణిముత్యాలు పథకం బావుంది, మా స్కూల్ విద్యార్ధులు కూడా ఇటీవల దీనికి ఎంపికయ్యారు, భవిష్యత్ లో నేను కూడా అందుకుంటానన్న భరోసా కల్పించారు, థ్యాంక్యూ సార్, గత ఏడాది మాకు ట్యాబ్లు ఇచ్చారు, మాకు చాలా ఉపయోగపడ్డాయి, మీరు విద్యార్ధుల భవిష్యత్ ఊహించి ఆలోచిస్తున్నారు. మీరు ట్రూ లెజెండ్ సార్, మీరు చరిత్ర సృష్టించారు, మేం ముందెన్నడూ చూడని విధంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి నా లాంటి పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ వరకు తీసుకెళ్ళిన ఘనత సాధించింది కచ్చితంగా మీరే సార్, ధ్యాంక్యూ వెరీమచ్ సార్. సుచరిత, పదో తరగతి విద్యార్ధిని, ఏపీ మోడల్ స్కూల్, కురుపాం జగన్ మామయ్య గుడ్ మార్నింగ్, అమ్మ ఒడి పథకం మాకు చాలా ఉపయోగపడుతుంది, జగనన్న విద్యాకానుక కిట్ లో ఇస్తున్న ప్రతిదీ కూడా చాలా బావున్నాయి, జగనన్న గోరుముద్దలో మంచి పౌష్టికాహారం ఇస్తున్నారు, నాడు నేడు కింద మా స్కూల్ లో చాలా సౌకర్యాలు కల్పించారు, నాడు సరస్వతి నిలయంలో సమస్యల తిష్టగా ఉండేవి, కానీ ఇప్పుడు అన్నీ ఏర్పాటు చేశారు, చక్కటి టాయిలెట్స్ ఏర్పాటు చేశారు, గతంలో గవర్నమెంట్ స్కూల్స్ అంటే చిన్నచూపు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చదవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిదీ, క్లాస్రూమ్స్ లో ఐఎఫ్పీలు కూడా ఏర్పాటుచేశారు, దాంట్లో లెసన్స్ చెబుతుంటే మాకు బాగా అర్ధమవుతున్నాయి, మాకు ప్రపంచస్ధాయి విద్య అందిస్తున్న మీకు పాదాభివందనాలు, మీరు నేను విన్నాను నేను ఉన్నానంటూ మా విద్యార్ధులకు అండగా ఉన్నారు, మట్టిలో ఉన్న మాణిక్యాలను ఆణిముత్యాలుగా తీర్చిదిద్దిన మేలిమి వజ్రం మీరే మామయ్యా, మా గురించి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆలోచిస్తున్న మా జగన్ మామయ్యకు పాదాభివందనం. సెలవు.