విశాఖ: ఈనాడు అధినేత రామోజీరావు ముందు మీ మైండ్ సెట్ మార్చుకోండి అంటూ మంత్రి బొత్ససత్యనారాయణ సూచించారు. రాష్ట్రంలో 5 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు, 20వేల మంది టీచర్స్‌కి ట్యాబ్‌లు ఇచ్చామని చెప్పారు. వాటి కొనుగోలులో పారదర్శకంగా టెండర్లు పిలిచి ఇచ్చామని తెలిపారు. ఈ నెల 12 నుంచి వచ్చే నెల 12లోపు ఇంటరాక్టివ్ ప్యానెల్స్‌ని ఏర్పాటు చేసి విద్యా బోధన చేయడానికి నిర్ణయం తీసుకుని కొనుగోలు చేశామని చెప్పారు. 10వేల స్కూల్స్‌లో స్మార్ట్‌టీవీలను కూడా పెట్టడానికి కొనుగోలు చేశామన్నారు. వీటన్నిటిలో అవకతవకలు జరిగాయని, జ్యుడిషియల్ ప్రివ్యూ జరగలేదని ఈనాడు వారు వార్తలు రాశారని మంత్రి తీవ్రంగా ఖండించారు. గురువారం విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడారు. - రామోజీరావు దయచేసి తెలుసుకోండి... - వందకోట్లు దాటిన ఏ టెండర్ అయినాజ్యుడిషియల్ ప్రివ్యూకి వెళ్లాలని ప్రభుత్వం జీవో ఇచ్చింది. - ఇదేమీ చంద్రబాబు పెట్టిన నిబంధన కాదు..మేమే పెట్టాం..దాన్ని మేమెందుకు ఉల్లంఘిస్తాం.. - నూటికి నూరు శాతం జ్యుడిషియల్ ప్రివ్యూ జరిగింది. ఆ తర్వాత పారదర్శకతతోనే టెండర్లు పిలిచాం. - జీఎస్టీ అనవసరంగా వంద కోట్లు ఖర్చు చేశారు అంటూ రాసుకొచ్చారు. - జీఎస్టీ అంటే రామోజీరావు చిట్‌ఫండ్స్ కంపెనీ లాంటిది కాదు కదా.. - దీనికి సడలింపులు ఏమీ లేవు..మేం పరిశీలించాం. ఒక వేళ సడలింపు ఉంటే రీఎంబర్స్ చేసుకుంటాం. ప్రభుత్వం అంత గుడ్డిగా ఉంటుందా..? - ఇంటర్నెట్, బ్రాడ్ బాండ్ లేదంటూ రాసుకొచ్చారు.. - ప్రభుత్వం ఎప్పుడైతే ఇంటరాక్టివ్ ప్యానెల్స్, స్మార్ట్ టీవీలు పెట్టాలనుకున్నామో అప్పుడే ఇంటర్‌నెట్ కోసం టెండర్లు పిలిచాం. - రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లకి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని టెండర్లు పిలిచాం. - దానిలో బీఎస్‌ఎన్‌ఎల్, రిలయెన్స్ వంటి సంస్థలు టెండర్లలో పాల్గొన్నాయి. - ట్యాబ్స్‌లో ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే విధానం కూడా మన వద్ద ఉంది. - రామోజీరావు ముందు మీ మైండ్ సెట్ మార్చుకోండి. *విద్యాకానుక కిట్లు వృథా అవాస్తవం:* - విద్యాకానుక కిట్లు మిగిలిపోయాయి..వృథా అయిపోయాయని రాసేశారు. - ఏ ఒక్కటీ వృథా కాలేదు. 5.46 లక్షల నోటు పుస్తకాలు మిగిలిపోయాయి. - అదనంగా మిగిలిపోయిన వాటిని ఈ ఏడాది వినియోగించడం జరిగింది. - 1.46 లక్షల బెల్టులు మిగిలిపోతే ఈ ఏడాది వినియోగించాం. - బూట్లు 1.46 లక్షలు మిగిలితే వాటిని కూడా పంపిణీ చేశాం. - యూనిఫాం డిజైన్ ఈ ఏడాది మార్చాం..ఆ నిర్ణయం తీసుకున్నామో అప్పుడే గత ఏడాది మిగిలిన వాటిని మోడల్ స్కూల్స్‌కి వాటిని అదనంగా ఒక జత పంపిణీ చేశాం. - డిక్షనరీలు 23,679 గత ఏడాది మిగిలాయి. వాటన్నిటినీ వినియోగించాం. - 39.96 లక్షలు మాత్రమే జగనన్న విద్యాకానుక కిట్లను ఈ ఏడాది కొనుగోలు చేశాం. - మిగిలిపోయిన వాటిని మిగిలిన వారికి పంపిణీ చేశాం. - తెలియకపోతే అడగొచ్చు కదా..? చెప్తాం కదా..? - అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది..? - ఆడిట్‌లో ప్రశ్నలు వేస్తారు..మేం జవాబు ఇస్తాం... - ఆడిట్‌లో జరిగే కరస్పాండెన్స్‌ను మీరు వార్తలుగా రాస్తే అది జర్నలిజం అవుతుందా..? - ఆడిట్‌లో ఫైనల్‌గా కొన్ని రిమార్క్స్ ఇస్తుంది...దాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పొచ్చు. - ఈనాడు చిన్నపిల్లల చేష్టలు మానుకుని హుందాగా ప్రవర్తించండి. *5 లక్షల కోట్లంటే..ఉలెన్ కోట్లు అనుకున్నారా..?:* - 5 లక్షల కోట్లు అంటే ఉలెన్ కోట్లు అనుకుంటున్నాడా అమిత్ షా..? - విదేశాల్లో నల్ల దనం ఉంది..మనిషికో లక్ష ఇస్తామని చెప్పినట్లు అనుకున్నారా..? తర్వాత తెచ్చుకుని పంచుకోవడం అనుకున్నారా..? - అంత పెద్ద వారు అలాంటి మాటలు మాట్లాడటం తగదు. - ఏదైనా మాట్లాడితే నిర్మాణాత్మకంగా మాట్లాడాలి తప్ప పాసింగ్ రిమార్క్స్ చేయడం కేంద్ర హోం మంత్రికి సరికాదు. - మా ప్రాధాన్యత అంశాలు నాలుగు..అవి విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం. - ఈ నాలుగింటిలో దేశంలోని ఏ రాష్ట్రం మన రాష్ట్రంతో పోటీ పడే పరిస్థితి లేదు. - అందుకే మన జీవన ప్రమాణాలు పెరిగి, తలసరి ఆదాయం పెరిగింది. మన జీడీపీ కూడా పెరిగింది. - ఈ నాలుగేళ్లలో విద్యలో తీసుకున్న సంస్కరణల కోసం రూ.60 వేల కోట్ల ఖర్చు పెట్టాం. - ఆరోగ్యం రంగంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చాం. - పేదవాడికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తున్నాం. - ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఇది మార్పు కాదా..? *బురద జల్లేసి మీరు తుడుచుకోండి అంటే సరైంది కాదు:* - కేంద్రం నిధులు ఇచ్చామంటున్నారు..మాకు రావాల్సిన హక్కుగా రావాల్సింది మాత్రమే ఇచ్చారు. - ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువగా, ప్రత్యేకంగా ఏమైనా ఇచ్చారా..? - పంట వేసినప్పటి నుంచీ రైతుకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రభుత్వం ఒక్క ఆంధ్రప్రదేశ్. - పంట పండక ముందే మద్దతు ధర ప్రకటించే రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. - ఎందుకు మిగతా రాష్ట్రాల్లో ప్రకటించలేకపోతున్నారు...అమిత్ షా ఆ విషయం ఎందుకు మాట్లాడరు..? - ఏదో వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి బురద జల్లేసి మీరు తుడుచుకోండి అంటే సరైంది కాదు... - ఈ రాష్ట్రంలో జరుగుతున్నవి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు చేయలేకపోతున్నారు...? - గుజరాత్, యూపీకి ఇచ్చినట్లు ప్రత్యేక ప్రోగ్రామ్స్ ఏమైనా మన రాష్ట్రానికి ఇచ్చారా..? - ఈ రాష్ట్రంపై ప్రేమ ఉంటే ఏపీకి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు..? - మా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతి సారీ ప్రత్యేక హోదా అంశాన్ని కూడా అడుగుతూనే ఉన్నారు. - ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల సంబధాల ప్రకారమే నిధులు ఇస్తున్నారే కానీ...అదనంగా ఇస్తున్నదేమీ లేదు. - అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలని మేం కొన్ని అంశాల్లో సహకరించాం. - రాజ్యాంగ పరమైన అంశాలపై మేం మద్దతు తెలుపుతాం. - రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలని మా పార్టీ విధానం. అందుకే మద్దతు తెలిపాం. - ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు వైఎస్సార్సీపీ మద్దతు పలికిన విషయాలను మర్చిపోయి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. *తైతక్కలాడే సీఎం అవసరమా అని మేమూ అనగలం:* - పవన్ కళ్యాణ్ తిరిగితే మాకేమైంది..? - ఆయన ప్రారంభించి 24 గంటలు దాటింది..ఏమైనా ఆటంకాలు వచ్చాయా..? - తమకు తామే రాజకీయ లబ్ధికోసం ఏదేదో సృష్టించుకుంటే సరికాదు. - రక్తపు మరకలతో ఎవరికి అంటాయి..? ఆ మాటలు ఎందుకు..? - తైతక్కలాడే పవన్ మనకు అవసరమా అని మేం కూడా అడగగలం.. - ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా తప్పు. బాషలో పటుత్వం, దృఢత్వం ఉండాలి. - ఔనన్నా కాదన్నా లోకేశ్...చంద్రబాబు కుమారుడు. పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీ.. - అందుకే తిరుగుతుంటారు..టంకుటమార విద్యలు ప్రదర్శిస్తుంటారు. - ప్రజల్ని మభ్యపెట్టి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తుంటారు. - ఇన్ని లక్షల కోట్ల సంక్షేమం పథకాలు అందిస్తున్న జగన్ గారిని ఎందుకు వదులుకుంటారు. - ఇది మేం ధైర్యంగా చెప్తున్న మాట...ఇలాంటి పరిపాలనను ఎందుకు వద్దనుకుంటారు..? - వాళ్లని తిరగమనండి...వారికి కూడా ఆరోగ్యం బాగుంటుంది.