అమరావతి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజామోదంతో ముఖ్యమంత్రి అయ్యారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఓదార్పు యాత్రకు నిరాకరించిన కాంగ్రెస్‌ను వీడి వైయస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టి గెలిచిన ధీరుడని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వెన్నుపోటు పొడిచి వైయస్ జగన్ సీఎం అవ్వలేదు..ప్రజామోదంతో ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కొని, ఆయన్ను అవమానపరిచి, ఆయన చావుకు కారణమైన చంద్రబాబు ఫేక్ అవుతారు. వెన్నుపోట్లు చంద్రబాబు పెటెంట్ హక్కు. మా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పార్టీ ఎలా మారాల్సి వచ్చిందో..మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాతి పరిస్థితులు అందరికీ తెలుసు. వైయస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టి ..ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు మాదిరిగా పార్టీ అధినేతకు వెన్నుపోటు పొడిచి, సీఎం పదవిని లాక్కున్నారు. చంద్రబాబు 1983లో ఓడిపోగానే కాంగ్రెస్ పార్టీ వీడారు. వాస్తవాలు ప్రజలకు తెలుసు కాబట్టే వైయస్ జగన్‌ను సీఎంగా చేసుకున్నారు. పింఛన్ల గురించి టీడీపీ సభ్యులు తప్పుగా మాట్లాడుతున్నారు. అక్టోబర్ 2019 నాటికి రాష్ట్రంలో 44 లక్షల పింఛన్లు ఉండేవి.. దాని తరువాత 61.94 లక్షల పింఛన్లు ఇస్తున్నాం. టీడీపీ హయాంలో రూ.450 కోట్లు ఇచ్చేవారు. మేం రూ.1500 కోట్లు ఇస్తున్నాం. మేం వచ్చాక పింఛన్ సొమ్ము ఎంత పెరిగింది. ఎంత శాతం అన్నది ఆలోచన చేయాలి. చంద్రబాబు చరిత్ర అంతా కూడా మోసం, దగా, వెన్నుపోట్లే అని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబు మెప్పుకోసం టీడీపీ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో ఎంత అవినీతి జరిగిందో తెలియదా అని నిలదీశారు. చంద్రబాబు హయాంలో సొంతంగా ఒక్క పథకమైనా అమలు చేశారా? . వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. అలాంటప్పుడు వైయస్ఆర్ కేంద్రాన్ని, కాంగ్రెస్ అధినేతను ఒప్పించి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104 వంటి పథకాలు వైయస్ రాజశేఖరరెడ్డి పేటెంట్ కాదా అని ప్రశ్నించారు. ప్రజాధరణ పొందిన పథకాలను తరువాతి ప్రభుత్వాలు కూడా ముట్టుకునే సహసం చేయలేదు. దేశానికే వైయస్ఆర్ పథకాలు ఆదర్శంగా నిలిచాయి. అలాగే వైయస్ జగన్ కూడా అలాంటి గొప్ప కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. అమ్మ ఒడి, నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం వంటి అంశాలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత మంది చేరారో తెలియదా?. పార్టీలు మారినా కూడా ఎవరి చావుకు కారకులం కాదని, మీలాగా వెన్నుపోట్లు పొడవలేదని చంద్రబాబును ఉద్దేశించి బొత్స మాట్లాడారు. చంద్రబాబు జీవితమే ఫేక్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సమయం వృథా చేయకుండా వాస్తవాలు మాట్లాడాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.