విద్యుత్ కోత‌లు ఉండ‌వు

మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి
 

 
ప్రకాశం జిల్లా: ఏపీలో విద్యుత్‌ కోతలు ఉండవని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంత ఖర్చయినా విద్యుత​ కొనుగోలు చేస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని పేర్కొన్నారు. టీడీపీ కుట్రపూరితంగా దుష్ర్పచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. విద్యుత్‌ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అన్ని విధాల భ్రష్టు పట్టించారు. సోలార్‌ పవర్‌ను కొనుగోలు చేయకుండా ప్రతిపక్షం అడ్డుకుందని’’ మంత్రి బాలినేని నిప్పులు చెరిగారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top