ఇప్ప‌ట్లో ఎన్నిక‌లంటే ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మే

మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి

 ప్రకాశం: ఇప్ప‌ట్లో స్థానిక ఎన్నికలను నిర్వహించడమనేది ప్రజల ప్రాణాలతో చెలగాటమేనని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే వ్యతిరేకిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తోన్న సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని.. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబు ఎలా చెబితే ఎస్‌ఈసీ అలా పనిచేస్తోంది. ప్రభుత్వ సలహా కూడా తీసుకోకుండా ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. గుజరాత్‌లో కూడా ఎన్నికలు వాయిదా వేశారని బాలినేని పేర్కొన్నారు. 

ప్రజాశ్రేయస్సుకు అవిరామ కృషి: మంత్రి వేణుగోపాల కృష్ణ
పశ్చిమగోదావరి: కులమతాలకు అతీతంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ మంచి పరిపాలన అందిస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. ప్రజాశ్రేయస్సుకు అవిరామంగా సీఎం కృషి చేస్తున్నారన్నారు. ఆనాడు చంద్రబాబు భస్మాసురుడులా వచ్చి.. మహిళల నెత్తిన చేతులు పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top