వైయ‌స్ఆర్ స్మృతి వ‌నం అభివృద్ధికి చ‌ర్య‌లు 

మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
 

 అమరావతి :  పావురాల గుట్టలో ఉన్న వైయ‌స్ఆర్ వైయ‌స్సార్‌ స్మృతి వనాన్ని రూ. 25 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బుధ‌వారం అటవీశాఖ ఉన్నతాధికారులతో  సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది 25 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అటవీ విస్తీర్ణంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఎర్రచందనం అమ్మకాల ద్వారా ఇప్పటివరకూ రూ. 1688 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఎర్రచందనం పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని..5 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి కేంద్రం అనుమతి కోరామని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో పెరిగిపోతున్న కాలుష్య నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. ఇక వన్యప్రాణుల దాడుల్లో మృతి చెందిన వారికి రూ. ఐదు లక్షల పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top