వర్షపు నీరు కాలనీల్లో నిల్వ ఉండకుడదు

ఒంగోలు మున్సిపల్‌ అధికారులకు మంత్రి బాలినేని ఆదేశం

ప్రకాశం: అకాల వర్షం నేపథ్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కాలనీల్లో పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై వేగవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగర శివారు కాలనీలు, కూరగాయలు మార్కెట్లలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.  
 

Back to Top