విశాఖ: విశ్వనగరంగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మంత్రి అవంతి మాట్లాడుతూ.. విశాఖ నగరం అభివృద్ధికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో వస్తాయిని మంత్రి దీమా వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ఇళ్లలో ఉన్న టీడీపీ నేతలు ఈ రోజు ఓట్ల కోసం వస్తున్నారని ఎద్దేవా చేశారు. కుప్పంలో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడిన బాష తీరు సరిగా లేదని మార్చుకోవాలని అవంతి శ్రీనివాసరావు హితువు పలికారు. జీవీఎంసీలో వైయస్ఆర్ సీపీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.