సీఎం వైయస్‌ జగన్‌ పాలనపై అన్నివర్గాల్లో సంతృప్తి

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై అన్ని వర్గాల సంతృప్తిగా ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఘన విజయం సాధించి నేటికి ఏడాది పూర్తయిందన్నారు. విశాఖపట్నంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన వైయస్‌ జగన్‌.. ముఖ్యమంత్రి అయిన ఏడాదిలో అట్టడుగు వర్గాలకు కూడా న్యాయం చేస్తున్నారని, అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రజారంజక పాలనను తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. టీడీపీ నేల దీక్షలు పెద్ద జోక్‌ అని, విద్యుత్‌ చార్జీలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. బషీర్‌బాగ్‌ ఘటనను జనం ఇంకా మర్చిపోలేదన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top