ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

మంత్రి అవంతి శ్రీనివాస్‌
 

విశాఖ: గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ సూచించారు. శనివారం వెంకటాపురం గ్రామంలో మంత్రి పర్యటించి, అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎల్సీ పాలీమర్స్‌లో పరిస్థితి పూర్తి అదుపులో ఉందన్నారు.మరో 24 గంటల్లో పూర్తి స్థాయి సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఇవాళ కేంద్రం నుంచి నిపుణులు వస్తున్నారని చెప్పారు. నిపుణుల సూచనల మేరకు గ్రామాల్లోకి అనుమతిస్తామన్నారు. బాధితులకు పునరావాస కేంద్రంలో అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top