పంక్చర్‌ అయిన టీడీపీకి ఈనాడు ఎంత గాలికొట్టినా వేస్ట్‌

ఈనాడు జర్నలిజం చేస్తుందా..? రాజకీయం చేస్తుందా..?

టిడ్కో ఇళ్లపై దుష్ప్రచారంపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫైర్‌ 

ప్రకాశం: తెలుగుదేశం పార్టీ పంక్చర్‌ అయిన ట్యూబ్‌ లాంటిదని, ఆ ట్యూబ్‌కి ఈనాడు రామోజీరావు ఎంత గాలికొట్టినా వేస్ట్‌ అని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. టిడ్కో ఇళ్లపై ఈనాడు పత్రిక చేస్తున్న దుష్ప్రచారంపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫైరయ్యారు. తప్పుడు కథనాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ఈనాడు జర్నలిజం చేస్తుందా..? లేక రాజకీయం చేస్తుందా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం ఈనాడు చేపట్టిందన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో టీడీపీ కాంట్రాక్ట్‌ పాత్ర మాత్రమే పోషించిందన్నారు. నివాసయోగ్యం లేని టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం పూర్తిచేసిందన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు, రామోజీరావు గుండెలపై చెయ్యి వేసుకొని వాస్తవాలు చెప్పాలన్నారు. డిసెంబర్‌ నాటికి 2.50 లక్షల టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు.  
 

Back to Top