చంద్రబాబు మహిళా ద్రోహి

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌
 

నెల్లూరు: సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుపడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు మహిళా ద్రోహి అని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ విమర్శించారు. జగనన్న అమ్మ ఒడి రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఆయన మాట్లాడుతూ..ఈ రోజు దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తరువాత చదువుకునే ప్రతి పేదవాడు బాగా చదువుకోవాలని ఆలోచన చేసిన మహానేత వైయస్‌రాజశేఖరరెడ్డి తారువాత ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌  . ఈ రోజు అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా ఒక్కో తల్లికి రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. జగనన్న కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు కావాలని పక్క రాష్ట్రాలు కోరుతున్నాయి. చదువుల ద్రోహిగా చంద్రబాబు మారిపోయారు. కుటిల రాజకీయాలతో ఇంగ్లీష్‌ మీడియాన్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. మహిళలకు మంచి చేస్తుంటే అడ్డుకుంటున్న చంద్రబాబు మహిళా ద్రోహిగా మిగిలిపోతారు. ఇప్పటికైనా చంద్రబాబు మారుతారని చూస్తే..ఆయన కుటిల రాజకీయాలు కొనసాగిస్తున్నారు. చంద్రబాబు పంచాయతీ ఎన్నికలు ముందుండి నడిపిస్తారంటా? ఆయన పార్టీకి 25 శాతం ఓట్లు కూడా రావు. కొన్ని తోకపార్టీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయి. ఆ పార్టీలకు 5 శాతం ఓట్లు కూడా రావు. ఏ రోజైనా దేశంలో చంద్రబాబు టాప్‌ టెన్‌ స్థానంలో ఉన్నారా? వైయస్‌ జగన్‌ ఏడాదికే దేశంలోనే మూడో స్థానంలో ఉన్నారు. దేశంలోనే మొట్ట మొదటి స్థానంలోకి త్వరలోనే వస్తారు. నీవా వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడేది. నీవా నెల్లూరు జిల్లా గురించి మాట్లాడేది. సోమశీల నుంచి కండలేరు వరకు సాగునీరు ఇచ్చేందుకు టెండర్లు పిలువబోతున్నారు. రాజు బాగుంటే ప్రకృతి సహకరిస్తుంది. భగవంతుడు కూడా ఆశీర్వదిస్తున్నారు. పెన్నాలో నాలుగు నెలలుగా నీరు పారుతుందంటే మన రాజు మంచొడు కాబట్టి ఇది సాధ్యమైంది. సీఎం వైయస్‌ జగన్‌ బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలకు మేలు చేస్తున్నారు.  వైయస్‌ జగన్‌కు నాజన్మంతా ఆయన సేవకుడిగా ఉంటాను. జన్మంటు ఉంటే ఆయన సైనికుడిగా పుట్టించాలని దేవుడ్ని కోరుకుంటూ..వైయస్‌ జగన్‌కు, నెల్లూరు ప్రజలకు రుణపడి ఉంటానని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top