క‌మీష‌న్ల‌కు, కాసుల‌కు క‌క్కుర్తిప‌డింది మీరు

దేవినేని ఉమాపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఫైర్‌

2021 డిసెంబర్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం

అంగుళం తగ్గకుండా ప్రాజెక్టు నిర్మాణం.. అనుమానం ఉంటే టేపుతో కొలుచుకో

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది

ఆర్‌అండ్‌ఆర్, పునరావాసం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు

పోల‌వ‌రం నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించిన మంత్రి అనిల్‌

పశ్చిమగోదావరి: 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. ఆ తర్వాత ఖరీఫ్‌కు గ్రావిటీ ద్వారా నీరు అందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు దివంగత మహానేత వైయస్‌ఆర్‌ శంకుస్థాపన చేశారని, ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ పూర్తి చేస్తారని తెలిపారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం పోలవరం పూర్తి చేస్తామన్నారు. 

పోలవరం ప్రాజెక్టును మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సందర్శించారు. కాపర్‌ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి అనిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. 2014 తరువాత పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా హోదా లభించిందని, దీనికి ప్రధాని నరేంద్ర మోడీ నిధులు మంజూరు చేసి సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. అనంతరం పోలవరంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాలపై విరుచుకుపడ్డారు.

‘కొందరు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. పోలవరం ప్రాజెక్ట్‌ పనుల్లో ఎక్కడా డీవియేషన్‌ లేదు. దీని గురించి దేవినేని ఉమా అడిగితే.. అనుమానం ఉంటే టేపుతో కొలుచుకోమని చెప్పాను. ప్రజలను అంటారా అని దేవినేని ఉమా మాట్లాడుతున్నాడు. నేను నువ్వు అడిగితే నీకే చెప్పాను. 2017లో కేంద్ర కేబినెట్‌లో ఏ అంశాలు అంగికరించారో బయటకు వచ్చి చదవగలరు. సీఎం వైయస్‌ జగన్‌ పబ్జీ ఆడుతారు, మంత్రి అనిల్‌ ఐపీఎల్‌ ఆడతారని విమర్శిస్తున్నారు. నువ్వు చెమ్మ చెక్క ఆడుతున్నావా..? మాట్లాడితే బూతుల మంత్రి అంటున్నావు. నువ్వు గతంలో మాట్లాడిన దానికంటే తక్కువే మాట్లాడాం. నీ గురించి కృష్ణా జిల్లాలో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకో.. ఎవర్నో చంపావు అంటున్నారు. 

పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు. ప్రాజెక్ట్‌ హైట్‌ తగ్గిస్తున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కమిషన్లకు, కాసులకు కక్కుర్తి పడింది మీరు. 2017లో అన్నింటినీ ఒప్పుకుంది చంద్రబాబు, గత ప్రభుత్వం. పోలవరంలో ఆర్‌ అండ్‌ ఆర్, పునరావాసం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. 50 వేల కోట్లలో 30 వేల కోట్లు ఉన్న ఆర్‌ఆండ్‌ఆర్‌ గురించి పట్టించుకోని మీరు 70 శాతం పూర్తి చేశామని ఎలా చెబుతారు. 

పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి అయిన తర్వాత పట్టిసీమ, పురుషోత్తంపట్నం ఎందుకు. కేవలం గ్రావిటీ ద్వారా విశాఖకు నీళ్లు తీసుకోవాలనే పైపులైన్‌ వేయాలని అనుకుంటున్నాము. దేవినేని ఉమా, చంద్రబాబుకు నిబంధనలు ఏంటో తెలియదు. మొదటి ఏడాది ఎవరు పూర్తిస్థ్ధాయిలో నీటిని నిల్వ చేయరు. సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం రేట్‌ ఆఫ్‌ ఫిల్లింగ్, హై టాఫ్‌ ఫిల్లింగ్‌ ఉంటుంది. వన్‌ థర్డ్, టూ థర్డ్‌ అలా నిల్వ పెంచుకుంటూ పోతాం. 194 టీఎంసీ నిల్వ చేసేందుకు అంగుళం తగ్గకుండా ప్రాజెక్ట్‌ కడతాం’ అని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top