బీసీలపై చంద్రబాబుది సవతి ప్రేమ

బీసీలను చంద్రబాబు 35 ఏళ్లుగా మోసం చేశారు

50 శాతం మించి రిజర్వేషన్లు ఉండకూడదని 2018లో బాబే చెప్పారు

స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డుకునేందుకు తన మనిషితో కేసు వేయించాడు

వైయస్‌ జగన్‌ నామినేటెడ్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

తాడేపల్లి: బీసీలపై చంద్రబాబుది సవతి ప్రేమ అని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. ప్రభుత్వంపై బురద జల్లడం, స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడమే ఆయన పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2018లో 50 శాతం రిజర్వేషన్లు చాలు అని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయనే తన మనిషితో 59 శాతం రిజర్వేషన్లు వద్దు అంటూ సుప్రీం కోర్టులో కేసు వేయించారని విమర్శించారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మంచి చేయాలనే చిత్తశుద్ధితో ఉన్నారని, చంద్రబాబు చెప్పే మాటలు ఎవరు నమ్మొద్దని సూచించారు. బుధవారం వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అనిల్‌కుమార్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..అనిల్‌కుమార్‌ మాటల్లోనే..
బీసీలను చంద్రబాబు 35 ఏళ్లుగా మోసం చేస్తున్నారు. రిజర్వేషన్లపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం.  వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుంది. 2018లో చంద్రబాబు కోర్టులో వేసిన అఫిడవిట్‌లో వేసిన ప్రధాన అంశం ఇలా ఉంది..తెలంగాణ విషయంలో అప్పట్లో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రెండు రాష్ట్రాలకు కామన్‌గా ఉంటుందని చంద్రబాబు ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఆ రోజు ఉన్న సుప్రీం కోర్టు యధావిధిగా 60 శాతం ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవాలని తీర్పు ఇచ్చింది. మళ్లీ 2016లో మరో తీర్పు ఇస్తూ ఇప్పటికే ఎన్నికలు పూర్తి అయ్యాయి కాబట్టి ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. కేవలం 2013 వరకు మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు. 50 శాతం రిజర్వేషన్లతో ఏ ఎన్నికలకు వెళ్లలేమని కోర్టుకు చెప్పారు. ఈ అఫిడవిట్‌ వేసింది 2018లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వేశారు. అప్పుడు 50 శాతం మించకూడదని ఆ రోజు చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 59 శాతం రిజర్వేషన్లు రూపొందిస్తూ కోర్టులో దాఖలు చేస్తే..మాకు అభ్యంతరం లేదని కోర్టు చెప్పింది. ఇలాగే మేం ముందుకు వెళ్తే హడావుడిగా చంద్రబాబు గుంట నక్కలా వ్యవహరించి బిర్రు ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి చేత కోర్టులో ఫిటిషన్‌ వేయించారు. కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి చంద్రబాబు హయాంలో ఉపాధి హామీ పథకం డైరెక్టర్‌. ఈ ప్రతాప్‌రెడ్డి సుప్రీం కోర్టులో రిజర్వేషన్లపై పిటిషన్‌ వేయడంతో ఆ కోర్టు హైకోర్టుకు సూచించింది. దీంతో హైకోర్టు 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని సూచించింది. చంద్రబాబు ఒకపక్క బీసీలపై ప్రేమ అంటారు..మరోపక్క బీసీలకు వ్యతిరేకంగా తన మనిషితో సుప్రీం కోర్టులో కేసు వేయిస్తాడు. ఈ రోజు తీర్పు అనుకూలంగా రాకూండా చేస్తారు. ఈ రోజు వచ్చి బీసీలపై సవతి ప్రేమ చూపుతూ..కుళ్లు, కుతంత్రాలు చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ శాశ్వత బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసింది. జస్టిస్‌ ఈశ్వరయ్యను చైర్మన్‌గా నియమించింది. మీ హయాంలో కోర్టులో వేసిన ప్రకారం 50 శాతం దాటకూడదని మాట్లాడిన చంద్రబాబు తన మనిషి చేత కేసు వేయించి హైకోర్టుకు తీసుకువచ్చారు. ఇప్పుడు బీసీలంటే ప్రేమ అంటున్నారు. యధవ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే 72 ఏళ్లు ఉన్నాయి. ఈ వయసులో కృష్ణా, రామా అంటూ ప్రశాంతంగా ఉండాలి. 35 ఏళ్లు టీడీపీని బీసీలు మోసి అలసిపోయారు. మీరు బీసీలకు చేసింది ఏమీ లేదు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత బీసీలకు సంబంధించి మంత్రివర్గంలోనూ, ప్రతి వర్గంలోను పెద్ద పీట వేస్తున్నారు. మీ హాయంలో ఓ మంత్రి తప్పు చేస్తే..దాన్ని ప్రశ్నిస్తే చాలు బీసీలపై దాడి అంటావు. నీవు మాత్రం నోరేసుకొని బీసీలను తిట్టవచ్చు. మీకేమైనా పెటెంట్‌ హక్కు ఉందా. మీరు కారణజన్ములా?. సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నీచమైన చరిత్ర చంద్రబాబుది. ప్రపంచంలో బూతద్దం వేసి వెతికినా ఇలాంటి క్యారెక్టర్‌ దొరకదు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. సకాలంలో ఎన్నికలు జరుగకపోతే ఈ రోజు ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో మనకే నష్టం. రూ.4 వేల కోట్లు కేంద్రం నుంచి తీసుకురావాలంటే ఎన్నికలు జరగాలి. ఏదో రకంగా ఎన్నికలు ఆపేయాలన్నదే చంద్రబాబు పని. చంద్రబాబుకు ఉన్న దొంగ తెలివి తేటలు ఎవరికి ఉండవు. ఎవరి మధ్య గొడవలు పెడదామన్నదే చంద్రబాబు ఎధవ రాజకీయాలు చేస్తున్నారు. యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తుల వల్ల బీసీలకు నష్టం. మా సీఎం వైయస్‌ జగన్‌ ఈ రోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఆదుకునేందుకు చిత్తశుద్ధితో ఉన్నారు. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే ఇప్పుడు వచ్చిన 23 సీట్లు కూడా భవిష్యత్‌లో రావు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top