సోమశిల రివర్స్ టెండరింగ్ లో రూ.68 కోట్లు ఆదా

మంత్రి అనిల్ కుమార్ యాదవ్
 

సోమశిల కెనాల్ లిఫ్ట్ కు సంబంధించి 2013లో 1500 కోట్లకు సాంక్షన్ అయ్యింది. ఈ ప్రాజెక్టు మొత్తంగా 5 టీఎంసీల నీరు తీసుకుని, 90,000 ఎకరాలు, 2,36,000 మంది జనాభా, దాదాపు 58 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి దాదాపు ఐదు మండలాలు, రెండు నియోజకవర్గాలు ప్రయోజనం పొందుతాయి.
మొదటి ఫేజ్ కింద 840 కోట్ల రూపాయిలతో పనులు మొదలయ్యాయి. 57 శాతం పనులు పూర్తి అయ్యాయి. 5323 ఎకరాల ల్యాండ్ కావాల్సి వస్తే ఇప్పటిదాకా సేకరించిన భూమి 2690 మాత్రమే. దానికి సంబంధించి ఆర్.ఆండ్ ఆర్ గ్రామాల్లో ఒక గ్రామానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
ఎన్నికలకు 4 నెలల ముందు సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్ 2 మొదలైంది. రాజశేఖర్ రెడ్డిగారి హయాంలో మొదలు పెట్టిన జలయజ్ఞంలో పెండింగ్ ప్రాజెక్టులు 15 ఏళ్లు అయినా పూర్తి కాలేదు. వాటిని ప్రయారటైజ్ గా పూర్తి చేయాలని మా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు.
గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం కనుక సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్ 1ను పూర్తి చేసి, సెకెండ్ ఫేజ్ కు వెళ్లి ఉంటే దాదాపు 5tmc ల నీరు కొన్ని వేల ఎకరాలకు ఉపయోగపడి ఉండేది. గత ఐదేళ్లలో వీరు ఆర్‌ అండ్ ఆర్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. డబ్బులొచ్చే పనుల మీద మాత్రమే శ్రద్ధపెట్టారు.
సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్ 2ని రివర్స్ టెండరింగ్ చేసాం. నిన్ననే చేసాం. మా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు ఆదాని ప్రభాకర్ గారికి ఈ కాంట్రాక్టు దక్కింది. రివర్స్ టెండరింగ్ రిజర్వ్ టెండరింగ్ అంటున్న వాళ్లకి చెబుతున్నా. నిజంగా అలా చేసేవాళ్లమే అయితే ఇవాళ ఈ ప్రాజెక్టు రివర్స్స టెండరింగ్ కు వెళ్లేవాళ్లం కాదు. పనులు మొదలుపెట్టని, ఎక్సెస్ కోట్ చేసిన పనులను రివర్స్ టెండరింగ్ కు వెళ్లి పారదర్శకంగా పనులు చేయిస్తున్నాం. సోమశిల ఫేజ్ 2 ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ లో 13% తగ్గి 68 కోట్లు ఆదా జరిగాయి. మా  ఎంపీ వర్క్ అయినా సరే దీనికి అతీతులు కారని ముఖ్యమంత్రి మరోసారి రుజువు చేసారు. ఈ రివర్స్ టెండర్ లో APR కనస్ట్రక్షన్స్ కూడా పాల్గొంది. కానీ వీరికంటే తక్కువ కోట్ చేసిన వేరే కంపెనీ పనులను దక్కించుకుంది. పారదర్శకతకు ఇదే నిదర్శనం.
పనుల్లో నాణ్యత, గత ప్రభుత్వాల అవినీతి గురించి విజిలెన్స్ కమీషన్ తో దర్యాప్తు చేయడం పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఖచ్చితంగా అన్ని వర్కుల మీదా రివ్యూ కూడా చేస్తాం.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top