మాట తప్పం.. మడమ తిప్పం

అనుకున్న టైమ్‌లో పోలవరం పూర్తిచేస్తాం

సీఎం వైయస్‌ జగన్‌కు భగవంతుడి అండ ఉంది

ఇచ్చిన మాట ప్రకారం నవంబర్‌ 1న పనులు స్టార్ట్‌ చేశాం

పోలవరం పనులకు మేఘా కంపెనీ భూమిపూజ చేసింది

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌

తాడేపల్లి: అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సంతోషకరమన్నారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భగవంతుడు అండగా ఉన్నారని, ఇచ్చిన మాట ప్రకారం.. నవంబర్‌ 1వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనులు మొదలుపెడుతున్నామని మంత్రి అనిల్‌ చెప్పారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రకార్యాలయంలో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రివర్స్‌టెండరింగ్‌ విధానంపై నవయుగ కంపెనీ కోర్టుకు వెళితే.. హైకోర్టు ప్రభుత్వానికి పాజిటివ్‌గా తీర్పు ఇవ్వడం సంతోషకరమన్నారు. నవంబర్‌ 1వ తేదీన పోలవరం పనులు మొదలుపెడతామని చెబితే.. ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేశాయన్నారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం.. మాట తప్పడం.. మడమ తిప్పడం మా నాయకుడికి, మా పార్టీ తెలియదని, ఇచ్చిన మాట ప్రకారం నవంబర్‌ 1వ తేదీన పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టామని, రివర్స్‌టెండరింగ్‌ విధానంలో పనులు దక్కించుకున్న మేఘా కంపెనీ భూమి పూజ చేసి పనులు కూడా మొదలుపెట్టిందన్నారు. పోలవరంలో డ్యామ్, పవర్‌ ప్రాజెక్టులోనే రూ.750 కోట్లు ఆదా చేశామని, రూ.58 టన్నల్‌లో ఆదా జరిగిందని, మొత్తం రూ. 800 కోట్లకు పైగా  ప్రభుత్వానికి ఆదా చేస్తూ.. పారదర్శకంగా ముందుకువెళ్తున్నామన్నారు.

ప్రాజెక్టులు పూర్తికి టైమ్‌లైన్‌ పెట్టుకొని ముందుకువెళ్తున్నామని మంత్రి అనిల్‌ చెప్పారు. రాష్ట్రంలో 86 శాతం రిజర్వాయర్లు నిండాయని, 14 శాతం కూడా గత ప్రభుత్వం ఆర్‌ అండ్‌ ఆర్‌ను విస్మరించడం వల్ల 8 శాతం నింపుకోలేకపోయామన్నారు. పోలవరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి భగవంతుడు అండగా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనమన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామన్నారు. పోలవరం పూర్తిచేసే గొప్ప అవకాశం సీఎం వైయస్‌ జగన్‌కు భగవంతుడు ఇచ్చాడన్నారు.

Read Also:నేటి నుంచి ఇతర రాష్ట్రాలో ఆరోగ్యశ్రీ వర్తింపు

Back to Top