పవన్‌ కల్యాణ్‌...నువ్వు రాజకీయ విటుడివా..? బ్రోకర్‌వా..? 

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  అంబటి రాంబాబు  

పవన్‌ కల్యాణ్‌ అసలేంటి ఈ రాజకీయ వ్యభిచారం..?

తెలంగాణలో బీజేపీ..ఏపీలో తెలుగుదేశంతో పొత్తా..?

విశాఖ బోట్ల దగ్ధం సంఘటనలో 3 రోజుల్లో పరిహారం అందించాం.

రాష్ట్ర ప్రజలకు ఏ ఆపద వచ్చినా జగన్ గారు అండగా నిలుస్తారు

స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి నువ్విచ్చిన రూ.50వేలూ ప్యాకేజీ సొమ్మేగా?

ఆయన పీకే కాదు..బాబు కోసం పనిచేసే కిరాయి కల్యాణ్*: మంత్రి  అంబటి రాంబాబు

నీ, నా సామాజికవర్గం చంద్రబాబు చేతుల్లో నలిగిపోయింది వాస్తవం కాదా?

వంగవీటి రంగాను అతి దారుణంగా హత్య చేసిన చంద్రబాబుకు బానిసవు నువ్వు.

బానిస బతుకు బతుకడానికి నీకు కనీసం సిగ్గుందా?

నువ్వు బానిసత్వం చేసేది కాక సామాజికవర్గం మొత్తాన్ని బాబుకు బానిసలుగా చేయాలనుకుంటున్నావా? 

రేపటి నుంచీ మళ్లీ ఏపీలో కామిడీ గళం ప్రారంభం

తాడేప‌ల్లి: పవన్‌ కల్యాణ్‌...నువ్వు రాజకీయ విటుడివా..? బ్రోకర్‌వా..?  అని  రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  అంబటి రాంబాబు  నిల‌దీశారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  అంబటి రాంబాబు మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే: 

మూడు రోజుల్లో నష్టపరిహారాన్ని అందించాం 
– 19వ తేదీన విశాఖపట్నం హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మత్స్యకారుల బోట్లు దగ్ధమయ్యాయి.
– సుమారు 30 బోట్లు పూర్తిగా ఆహుతయ్యాయి. మరో 19 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 
– వెంటనే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గారు చాలా స్పీడ్‌గా స్పందించారు.
– ఎవరైతే అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయారో వారిని ఆదుకోవాలని ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 
– బోటు విలువలో 80 శాతం ఇవ్వాలని నిర్ణయించి తక్షణమే ఎటువంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకున్నారు. 
– 19వ తేదీన అగ్నిప్రమాదం జరిగితే వెంటనే అంచనా వేసి చాలా వేగంగా 3 రోజుల్లోనే వారందరికీ చెక్కులు పంపిణీ చేశారు. 
– సుమారు రూ.7.11 కోట్ల చెక్కులు వారికి అందజేసి ఆదుకున్న ప్రభుత్వం ఇది. 
– నష్టపరిహారం ఇచ్చి వారి జీవితాల్లో నష్టం లేకుండా చేసి..వారు మళ్లీ తమ వృత్తిని చేసుకునేందుకు జగన్‌ గారు పెద్ద మనసుతో సాయం చేశారు. 
– ఇంత స్పీడుగా నష్టపరిహారం ఇచ్చిన ప్రభుత్వాలు లేవని చాలా మంది ప్రశంసించారు. 

 నాలుగో భార్య విడాకులివ్వకపోయినా దానికి కారణం జగన్‌ గారేనంటాడు:
– ఇదిలా ఉంటే..పొగడక పోతే పొగడక పోయారు. కొంత మంది ఆఘమేఘాలపై వచ్చి మమ్మల్ని తిట్టే కార్యక్రమం, ధూషించే  కార్యక్రమం చేపట్టారు. 
– ఆఘమేఘాలపై పవన్‌ కల్యాణ్‌ వచ్చి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున పంపిణీ చేశారు. 
– మంచిదే..కానీ జగన్మోహన్‌రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని దూషించే కార్యక్రమం చేపట్టాడు. 
– చివరికి ఆయన స్పెషల్‌ ఫ్లైట్‌ సమయానికి రాలేదట..దానికి కూడా జగన్‌ గారే కారణమంటున్నాడు.  
– ఈ రాష్ట్రంలో ఏది జరిగినా దానికి కారణం జగన్‌ గారే అనడం పవన్‌ కల్యాణ్‌కు అలవాటు అయిపోయింది. 
– ఆయనకు గెడ్డం బాగా పెరిగినా, గెడ్డంలో మెరుపు వెంట్రుక వచ్చినా...చివరికి జలుబు చేసినా జగన్‌ గారే కారణం అంటున్నాడు. 
– చివరికి ఆయన నాలుగో భార్య వద్ద నుంచి విడాకులు సక్రమంగా రాకపోయినా దానికి జగన్‌ గారే కారణమనే అలవాటు ఆయనకు వచ్చింది. 
– నీకు కక్ష, కార్పణ్యం ఉండొచ్చు...చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనే తపన ఉండొచ్చు. 
– మంచి చేసిన జగన్‌ గారిని దూషిస్తే మాత్రం ప్రజలు సహించరు. 
– మీరు స్పెషల్‌ ఫ్లైట్‌ వచ్చినా, రూ.50వేలు ఇచ్చినా, లింగమనేని వారు స్థలం ఇస్తే దానిలో మీరు ఇళ్లు కట్టినా అవన్నీ ప్యాకేజీ సొమ్ము తప్ప నీ కష్టార్జితం కాదు. 
– లింగమనేని ద్వారానే, మనోహర్‌ ద్వారానే చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని నువ్వు మాట్లాడుతున్నావు. 
– చంద్రబాబు ప్యాకేజీ ఇవ్వడం, నువ్వు స్పెషల్‌ ఫ్లైట్‌లో రావడం, మనోహర్‌ నీకొక స్లిప్‌ తీసుకొస్తే దానిలో ఉన్న బాష మాట్లాడుతున్నారు. 
– ఆఘమేఘాలపై వచ్చేశారు..రూ.50వేలు ఇచ్చి జగన్‌ గారిని దూషిస్తున్నారు. 

ఈ రాష్ట్రానికి నీకు ఏం సబంధం పవన్‌ కల్యాణ్‌..?:
– పవన్‌ కల్యాణ్‌..నీకు ఈ రాష్ట్రానికి ఏమిటయ్యా సంబంధం? 
– ఈ రాష్ట్రంలో నువ్వు ఉండవు..ఈ రాష్ట్రంలో నీకు సొంత ఊరే లేదు. 
– కాసేపు బాపట్ల అంటావ్‌..కాసేపు చీరాల అంటావ్‌...కాసేపు గుంటూరు అంటావ్‌
– కనీసం సొంత ఇళ్లు కూడా లేదు...ఓటుందా అంటే ఓటు కూడా లేదు. 
– అసలు నీ భార్యలు పిల్లలు ఎక్కడుంటారు..? వాళ్లు కూడా ఈ రాష్ట్రంలో లేరు. 
– చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని వచ్చి జగన్‌ గారిని విమర్శించి వెళ్లడం తప్ప ఈ రాష్ట్రంతో నీకేంటి సంబంధం..? 
– అసలు ఎక్కడ పోటీ చేస్తావో కూడా తెలియదు. 
– ప్యాకేజీ తీసుకుంటావ్‌..వస్తావు..దూషిస్తావ్‌..వెళ్తూ దుర్మార్గపు రరాజకీయం చేస్తున్నావు. 
– ఈ రాష్ట్రంలోని నీ సామాజిక వర్గాన్ని మాత్రం చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నావు. 
– చంద్రబాబు గారికి నీ సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టి..దాని ద్వారా ప్యాకేజీ తీసుకుని జగన్‌ గారికి వ్యతిరేకంగా మాట్లాడి చంద్రబాబును బలోపేతం చేయాలనే కార్యక్రమంలో నిమగ్నమవ్వడం దురదృష్టకరం. 

నీలా సామాజికవర్గం మొత్తాన్ని చంద్రబాబు చెప్పులు మోయించాలనుకుంటున్నావ్‌..:
– నీ, నా సామాజిక వర్గం చంద్రబాబు చేతుల్లో నలిగిపోయిన సామాజికవర్గం. 
– వంగవీటి రంగా గారిని అతి దారుణంగా హత్య చేసిన చంద్రబాబుకు నీ సామాజికవర్గాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి బానిసలను చేయాలని చూస్తున్నావు. అసలు నీకు సిగ్గుందా? 
– నువ్వు బానిస బతుకు బతుకుతున్నావు..చంద్రబాబు చెప్పులు మోస్తున్నావు..బానిసగా వ్యవహరిస్తున్నావు. 
– బానిసగా వ్యవహరిస్తూ చెగువీరా అంటావ్‌..సుబాష్‌ చంద్రబోస్‌ అంటావు..వీరుడంటూ మాట్లాడుతున్నావు. 
– నీ, నా సామాజికవర్గాన్ని బానిసలుగా చిత్రీకరించి చంద్రబాబు, లోకేశ్‌ పల్లకి మోయించాలనే నీ ప్రయత్నం విఫలమవుతుంది. 
– ఎందుకంటే పౌరుషం కలిగిన సామాజికవర్గం మాది..ఆ సామాజికవర్గాన్ని నువ్వు తాకట్టు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నావు. 
– నీలాంటి బానిసలను నాయకులుగా గుర్తించదు నా సామాజికవర్గం. 
– వీరుడుగా పోరాడిన వారిని గుర్తిస్తుంది తప్ప ఒకరి చెప్పులు మోసి, కాళ్లు పట్టుకుని, పల్లకి మోసే నీలాంటి వ్యక్తులను నాయకులుగా గుర్తించదు.
– తాత్కాలికంగా నీ సినిమాల్లో వేషాలు చూసి కాసేపు మోసపోతే మోసపోవచ్చు కానీ నువ్వు చేస్తున్న పనికి ఈ సామాజికవర్గం మోసపోదు. 
– నీకు ఒక స్థిరత్వం లేదు..అవగాహన లేదు..రాజకీయాల్లో ఎప్పుడు ఏం చేస్తావో తెలియదు. 
– చంద్రబాబు నిన్ను లోకేశ్‌ కంటే బాగా చూసుకుంటున్నాడు. 
– అప్పుడప్పుడు లోకేశ్‌ అయినా బాబుపై తిరగబడతాడేమో కానీ..నువ్వు మాత్రం తిరగబడవు. 
– ఏ స్లిప్పు రాస్తే అది..ఏది చెబితే అది చేసే దుస్థితికి నువ్వు దిగజారిపోయావు. 
– నువ్వు దిగజారితే దిగజారావు..నీతో పాటు నీ సామాజికవర్గాన్ని కూడా దిగజార్చాలని ప్రయత్నం చేస్తున్నావు. 
– టీడీపీ చెప్పులు మోయించాలని నువ్వు చేసే ప్రయత్నం నీ, నా సామాజికవర్గం అంగీకరించదు. 
– నువ్వు సామాజికవర్గాన్ని ఉద్దరించడానికి వచ్చిన వాడివి కాదు. 
– నువ్వు ఈ జాతిని, ఈ సామాజికవర్గాన్ని అమ్ముకుని బతకాలని వచ్చిన వాడివి. 
– అదే ఈ పది ఏళ్ల చరిత్రలో ప్రజలకు, సామాజికవర్గానికి అర్ధమైంది. 

పవన్‌ కల్యాణ్‌ నువ్వు రాజకీయ నటుడివా..? విటుడివా..?:
– అసలు నువ్వు రాజకీయ నాయకుడివా..? రాజకీయ నటుడివా?
– రాజకీయ విటుడివా..? లేక రాజకీయ బ్రోకర్‌వా..? 
– అసలు నీ వ్యక్తిత్వం ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో నీ పాత్ర ఏంటి? 
– తెలంగాణలో నువ్వు ఎవరికి మద్దతు పలుకుతున్నావు..చంద్రబాబు ఎవరికి మద్దతు పలుకుతున్నాడు...?
– నువ్వేమో బీజేపీ పక్కన నీ జెండా కట్టావు. చంద్రబాబు జెండా మాత్రం కాంగ్రెస్‌ పక్కన కట్టాడు. 
– చంద్రబాబు కామ్‌గా ఇంట్లో కూర్చుంటే కాంగ్రెస్‌ మీటింగుల్లో పచ్చ జెండాలు పైకి లేస్తుంటాయి. 
– నీ జెండాలేమో బీజేపీలో డైరెక్ట్‌గా లేస్తున్నాయి. 
– అక్కడ ఒక నాటకం..ఇక్కడ ఒక నాటకం..ఏంటయ్యా అసలు నీ బతుకు..? 
– ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు అయితే దానికన్నా మించిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌.
– పవన్‌ కల్యాణ్‌ అసలేంటి ఈ రాజకీయ వ్యభిచారం..? 
– అక్కడ బీజేపీ..ఇక్కడ తెలుగుదేశం...వాళ్లకేమో అక్కడ కాంగ్రెస్‌..ఇక్కడ నువ్వు..
– అసలు నువ్వు బీజేపీకి సెకండ్‌ సెటప్‌వా..? లేక టీడీపీకి సెకండ్‌ సెటప్‌వా..? 
– నీ బతుకేంటి..వ్యవహారమేంటో తేల్చుకోవాల్సిన సమయం అసన్నమైంది. 
– ప్రజలు కూడా ఈ వ్యవహారాలను గమనించాల్సిన సమయం ఆసన్నమైంది. 
– పవన్‌ కల్యాణ్‌ కేవలం ప్యాకేజీ తీసుకుని మహత్తర నాటకాలు ఆడుతున్నాడు. 

నువ్వు చేసే రాజకీయాలపై నాతో చర్చకు సిద్ధమా?:
– ఇప్పటికైనా నువ్వు చేస్తున్న రాజకీయాల పట్ల నోరు విప్పి మాట్లాడు. 
– దమ్ముంటే నాతో చర్చకు రా..
– ఇదేమన్నా సినిమా అనుకున్నావా..? అక్కడో డాన్స్‌ ఇక్కడో డాన్స్‌ వేయడానికి? 
– ప్రజలు కొద్దోగొప్పో నిన్ను నమ్ముకున్నారు..వాళ్లందరినీ నట్టేట్లో ముంచే ప్రయత్నం చేస్తున్నావు. 
– కేవలం క్యాష్‌ తీసుకుని పనిచేసే వ్యక్తిగా నువ్వు తయారయ్యావు. 
– ఆయన పీకే కాదు..కేకే..కేకే అంటే కిరాయి కల్యాణ్‌వి. 
– నువ్వు కిరాయి తీసుకుని ఎంత దారుణానికైనా సిద్ధపడతావు. 
– కిరాయి రౌడీలు కిరాయి తీసుకుని మనుషులను హత్య చేస్తారు. 
– అదే విధంగా నువ్వు కిరాయి తీసుకుని నువ్వు రాజకీయంగా హత్యలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. 

ఎక్కడ నష్టం జరిగినా తక్షణమే స్పందించేది మా జగన్‌ గారే:
– మేం రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చామని ఆరోపిస్తున్నారు. మేం చాలా పారదర్శకంగా చెక్‌లు ఇచ్చాం. ఎవరికి ఎంత ఇవ్వాలో చెప్పి మరీ ఇచ్చాం. 
– ఇప్పుడే కాదు..ఎప్పుడు ప్రజలకు నష్టం జరిగినా తక్షణమే స్పందించే ప్రభుత్వం జగన్మోహన్‌ రెడ్డి గారి ప్రభుత్వం. 
– గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే కనీసం స్పందించావా పవన్ కల్యాణ్..? 
– ఇప్పుడొచ్చి బోట్లు దగ్ధమైతే..మేం సాయం చేస్తే మమ్మల్ని కిరాయి కల్యాణ్ దూషించడమేంటి?  
– 45 సంవత్సరాల దోపిడీ చేసిన చంద్రబాబు పల్లకీ మోయాలనే వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. 
– ఆయన చెప్పినట్లు నా సామాజికవర్గం చంద్రబాబు చెప్పులు మోయమంటే మోయడానికి సిద్ధంగా లేదు. 

 విశాఖలో ఆయన పంచింది ప్యాకేజీ సొమ్మే:

– పవన్‌ కల్యాణ్‌ పగటి కలలు కంటుంటారు. హైదరాబాద్‌లో పడుకుని షూటింగ్‌ అయ్యాక కలలు కంటారు. 2019 మందు జగన్‌ గారు ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు అంటూ కలలు కన్నాడు. 
– ఆయనకు రాజకీయాలు తెలియవు..ఆయన రాజకీయ నాయకుడు కాదు. కిరాయి తీసుకుని పనిచేసే కల్యాణ్‌. అయన్ను పట్టుకుని ఎవరైనా వెళితే కుక్క తోకపట్టుకుని గోదావరి ఈదినట్లేనని ప్రజలకు చెప్తున్నా. 
– దోచుకొచ్చిన సొమ్ము కాదది అంటున్నాడా..? అవును దోచుకొచ్చిన సొమ్ము కానే కాదు..అది ప్యాకేజీ సొమ్ము. ఇన్‌కం టాక్స్‌ ఎగ్గొట్టిన సొమ్ము. 
– ఒక సారి ఇన్‌కం ట్యాక్స్‌ బహిర్గతం చేయమని అడుగుతున్నా. నాకు రోజుకు రూ.2 కోట్లు వస్తాయన్నాడు..తాను భగత్‌ సింగ్‌ కదా..బహిర్గతం చేయమనండి. 
– అంతా సూట్‌ కేస్‌ సొమ్ము..స్లిప్‌ తీసుకుని ఆఘమోఘాలపై ఆ స్లిప్పులోనిది చదివి వెళ్లడం తప్ప మరొక పనిలేని వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. 
– పవన్‌ కల్యాణ్‌ గారికి రాజకీయాలు తెలియదు..జలయజ్ఞాన్ని ప్రారంభించింది రాజశేఖరరెడ్డి గారు. దోచుకున్నారు..దాచుకున్నారు అనే మాటలు నిజమైతే రెండో సారి వైఎస్సార్‌ని ఎన్నుకునేవారా? 
– రాజశేఖరరెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత పిల్ల పవన్‌ కల్యాణ్‌కు ఉందా? 
– పవన్‌ కల్యాణ్‌కి సూట్‌కేసులో డబ్బులు లెక్కేసుకోవడం, స్లిప్పులోది చదవడం తప్ప సొంత ఆలోచన లేదు..సొంత బుర్రలేదు. 

రేపటి నుంచి హాస్యభరిత కామిడీ గళం ప్రారంభం:
– ఆగిపోయిన హాస్య భరిత చిత్రం మళ్లీ ప్రారంభం కాబోతోంది. దాన్ని క్యామిడీ గళం అంటారో ఏమంటారో మీ ఇష్టం. 
– అసలు ఎందుకు మొదలు పెట్టాడో..ఎందుకు ఆపేశాడో...ఎందుకు మొదలు పెడుతున్నాడో తెలియదు. 
– ఈ అసలు పుత్రుడు చేసే కామిడీ రేపటి నుంచి అందరూ చూడొచ్చు. 
– ఆయన ఎక్కడ నుంచి పడితే అక్కడ నుంచి పవన్‌ కల్యాణ్‌ ధైర్యం పొందుతుంటాడు. 
– తెలంగాణ పోరాటం చూసి ధైర్యం పొందాడు..చెగువీరా పోరాటం చూసి ధైర్యం పొందానంటాడు. 
– భగత్‌ సింగ్‌ను చూసి అంటాడు..అతన్ని ఎవరికైనా చూపిస్తే మంచిది. 
– కమ్యూనిస్టులను చూసి ధైర్యం పొందాను అంటాడు..అప్పుడప్పుడు అడవుల్లోకి వెళ్దామనుకున్నాను అంటాడు. 

తెలంగాణలో కనీసం నీ పార్టీ అభ్యర్ధులకైనా చంద్రబాబు మద్దతిస్తున్నాడా..?:
– అక్కడ పోటీ చేస్తున్న వారు ఎందుకు నువ్వు ప్రచారానికి రావడం లేదని పవన్‌ కల్యాణ్‌ని అడగాలి. 
– అక్కడకు వెళ్లడం కంటే ఇక్కడ దూషించడమే ముఖ్యం అనుకుంటున్నాడు..ఎందుకంటే ఇక్కడ క్యాష్‌ వస్తుంది.
– అక్కడ చిత్తశుద్ధి లేని రాజకీయం..ఫలితాలు వచ్చాక అక్కడ ఎన్ని గెలుస్తాడో చూద్దాం. 
– పవన్‌ కల్యాణ్‌ అసలు నీకు సిగ్గుందా? చంద్రబాబు కనీసం నీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న 8 మందికన్నా సపోర్ట్‌ చేస్తున్నాడా లేదా కనుక్కో. 
– నాకు సపోర్ట్‌ చేయాల్సిన అవసరం లేదు..నాకు క్యాష్‌ ఇస్తే చాలు అంటే నీ ఇష్టం. 
– తెలుగుదేశం.. కాంగ్రెస్‌ పార్టీకి బహిరంగంగా సపోర్ట్‌ చేస్తున్నది వాస్తవం. 
– ఆ 8 మంది ఎందుకు నిలబడ్డారో వారైనా ఆలోచించుకోవాలి. 
– తెలంగాణలో కేసీఆర్‌ మొదట గెలిచాడు..మేం ఓడిపోయావు..
– రెండో సారి కేసీఆర్‌ గెలిచాడు..ఇక్కడ మేం గెలిచాం..దీన్ని బట్టి అక్కడ రాజకీయాలు వేరు..ఇక్కడి రాజకీయాలు వేరు అనేది గుర్తించాలి. 
– అక్కడి రాజకీయాల ప్రభావం ఇక్కడ ఉండదు. 
– అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా వారితో మాకు సంబంధ బాంధవ్యాలుంటాయి. ఎందుకంటే పక్క రాష్ట్రం కాబట్టి. 
– వారాహి కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే లైసెన్స్‌ ఉన్నట్లుంది. తెలంగాణాలో దానికి చంద్రబాబు లైసెన్స్‌ ఇచ్చినట్లు లేడు.  
– జగన్‌ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మాత్రమే తిరుగుతుంది కాబోలు. 
– అక్కడ తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట ఎన్నికల ప్రచారానికి కూడా వారాహి వెళ్లడం లేదు. 
– ఇది కేవలం చంద్రబాబు చెబితే చేసిన వారాహి కాబట్టి ఆయన డైరెక్షన్‌లో మాత్రమే నడుస్తుందని అర్ధం చేసుకోవాలి. 

Back to Top