గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయలేకపోయారని దేవినేని ఉమాను ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ నేత దేవినేని ఉమా వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాఫర్ డ్యామ్ పూర్తిచేయకుండా డయాఫ్రమ్ వాల్ పూర్తిచేస్తారా..? డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి గత తెలుగుదేశం ప్రభుత్వ తప్పిదమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమాను ప్రజలు ఎప్పుడో పీకి పారేశారని గుర్తుచేశారు.