పోలవరంలో మంత్రి అంబటి పర్యటన

స్పిల్‌ వే, కాపర్‌ డ్యామ్‌ పనులను పరిశీలించిన మంత్రి

ఏలూరు: వరదలు తగ్గిన వెంటనే పోలవరం ప్రాజెక్టు లోయర్‌ కాపర్‌ డ్యామ్‌ పనులు మొదలుపెడతామని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. ప్రాజెక్టు స్పిల్‌ వే, కాపర్‌ డ్యామ్‌ పనులను పరిశీలించారు. గోదావరి నదికి ఈసీజన్‌లో పెద్ద ఎత్తున వరద వచ్చిందని, వరదల వల్ల మూడుసార్లు లోయర్‌ కాపర్‌ డ్యామ్‌ పనులు కుంటుపడ్డాయని చెప్పారు. వరద పూర్తిగా తగ్గిన వెంటనే పనులు మొదలుపెడతామన్నారు. చంద్రబాబు హయాంలో లోయర్, అప్పర్‌ కాపర్‌ డ్యామ్‌లు పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్‌ నిర్మించి చారిత్రక తప్పిదం చేశారన్నారు. అనాలోచిత నిర్ణయాలతో చంద్రబాబు చేసిన తప్పులను కరెక్ట్‌ చేసుకుంటూ వస్తున్నామని చెప్పారు. చంద్రబాబు చేసిన తప్పులు పోలవరం ప్రాజెక్టుకు శాపాలుగా మారాయన్నారు. 

తాజా వీడియోలు

Back to Top