అమరావతి: చంద్రబాబుకు ఎన్నికల ముందు మాత్రమే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఎన్నికల ముందు అన్నా క్యాంటీన్లు తెచ్చారని గుర్తు చేశారు. సంక్షేమం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. మంగళవారం సభలో మంత్రి మాట్లాడారు.
టీడీపీ హయాంలో ఏ సంక్షేమ కార్యక్రమం పెట్టినా కూడా ఎన్నికల కోసమే వాడుకున్నారు. నిజంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు, యువత, మహిళలకు మేలు చేయలేదు. అన్నా క్యాంటీన్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు టీడీపీ ప్రారంభించింది. పూర్తిగా అవినీతిమయం అయ్యింది. ఒక్కో దానికి రూ.40 లక్షలు పెట్టారు. ప్రభుత్వం ఒక్కో భోజనానికి రూ.75 ఇస్తే, వాళ్లు రూ. 15లకు పెట్టారు.ఏడు నెలల కాలంలో రూ.90 కోట్లు ఖర్చు చేశారు. టీడీపీ దిగిపోతూ అన్ని బకాయిలు పెట్టి వెళ్లారు. రాజధాని నిర్మాణంలో అడ్డగోలుగా దోచుకున్నారో వాళ్లకే అన్నా క్యాంటీన్లకు ఇన్‌ఫ్రాక్చర్ ఏర్పాట్లకు డబ్బులు ఇచ్చారు. కేవలం ఎన్నికల కోసమే అన్నాక్యాంటీన్లు ఏర్పాటు చేశారు. రుణమాఫీచేస్తామని మహిళలను మోసం చేశారు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ ఇచ్చారు. పింఛన్ల పెంపు కూడా వైయస్ జగన్ పాదయాత్రలో ప్రకటిస్తే.. ఆ తరువాత ఎన్నికల ముందే చంద్రబాబు పింఛన్లు పెంచారు.మన ప్రభుత్వం వరుసగా నాలుగేళ్లు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వైయస్‌ఆర్ చేయూత అన్న ఆలోచన వైయస్ జగన్‌కు మాత్రమే వచ్చింది. సంక్షేమం, అభివృద్ధి అన్నది రాష్ట్రానికి రెండు కళ్లుగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.