సీఎం వైయస్‌ జగన్‌కు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు

మంత్రి ఆదిమూలపు సురేష్‌

సీఎం వైయస్‌ జగన్‌ మహిళా పక్షపాతి

గత ప్రభుత్వం డ్వాక్రా మహిళలను మోసం చేసింది

ఒంగోలు: వైయస్‌ జగన్‌కు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. రాష్ట్రంలో ఇవాళ సంక్షేమ పాలన నడుస్తోందని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని సీఎం వైయస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన ఆసరా రెండో విడత కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడారు. 
ఈ రోజు ఒక శుభ దినం..ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సీఎం వైయస్‌ జగన్‌ పొదుపు సంఘాలకు బాకీ పడ్డ బకాయిలను తీర్చుతానని మాట ఇచ్చి..నవరత్నాల్లో చేర్చి..మొదటి విడత డబ్బులు చెల్లించి..ఈ రోజు రెండో విడత డబ్బులు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చారు. విశ్వసనీయతకు, మాట ఇచ్చి నెరవేర్చుతారని చరిత్రలో నిలిచిపోయారు. ఆసరా కార్యక్రమాన్ని పది రోజుల పాటు ఉత్సవాలుగా నిర్వహిస్తున్నాం. పొదుపు సంఘాలకు చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో మనందరికి తెలుసు. రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. మహిళల ఆర్థిక ఇబ్బందులను వైయస్‌ జగన్‌ తన సుదీర్ఘ పాదయాత్రలో చూశారు. మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు రుణాలు మాఫీ చేస్తూ మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలకు సమాజంలో సమూచిత స్థానం కల్పిస్తున్నారు.

ఈ రెండున్నరేళ్ల వైయస్‌ జగన్‌ పాలనలో ఒక అమ్మలాగా బిడ్డల ఆలన పాలన చూస్తున్నారు. అమ్మ ఒడి, ఆసరా, వంటి కార్యక్రమాలు కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.  తప్పు చేస్తే దండన తప్పదని దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. మద్యపాన నిషేదం దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రజల్లో ఒక సుస్థిర స్థానాన్ని వైయస్‌ జగన్‌ ఏర్పరుచుకున్నారు. అందుకే మహిళలంతా వైయస్‌ జగన్‌ను అన్నగా, కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు. అందుకే పదవుల్లో, పనుల్లో మహిళలకు 50 శాతం కేటాయించారు.కుటుంబ సభ్యుల్లో ఒక్కడిగా, పెద్ద కుమారుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ రోజు నల్లకాల్వ సభలో వైయస్‌ జగన్‌ చెప్పినట్లుగా నాన్నగారు నాకు ఈ రాష్ట్రమనే పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని చెప్పారని, ఆ మాటకు కట్టుబడి ఈ రాష్ట్రాన్ని ఒక కుటుంబంలా చూస్తూ చక్కని పాలన అందిస్తున్నారు. అందుకే అక్కచెల్లెమ్మలు, అవ్వతాతలు, అన్నాదమ్ములు, ఇలా అన్ని వర్గాల వారు వైయస్‌ జగన్‌కు అండగా నిలుస్తున్నారు. మీరే 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని, మా బిడ్డల భవిష్యత్‌ను తీర్చిదిద్దాలని కోరుకుంటున్నారు.

జిల్లాలో వారం ముందుగానే దసరా పండుగ వచ్చినట్లుగా ఉంది. టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా రాష్ట్ర ప్రజలు వైయస్‌ జగన్‌కు తోడుగా ఉంటామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేస్తామని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం సుస్థిర పాలన అందిస్తుందని ప్రజలు పొలికేకలాగా నినాదాలు చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ జిల్లాకు వచ్చిన ప్రతి సారి వరాల జల్లు కురిపించారు. వెలిగొండ ప్రాజెక్టును రెండేళ్లలో వైయస్‌ జగన్‌ పరుగులు పెట్టించారు. పునరావాసకాలనీల నిర్మాణాలు, నిర్వాసితులకు ప్యాకేజీలు మూడింతలుగా ఇచ్చారు. జిల్లాలో త్రిబుల్‌ ఐటీ, యూనివర్సిటీలకు నిధులు కూడా త్వరలోనే కేటాయింపులు జరుగుతాయి. వెలిగొండ ప్రాజెక్టు నుంచి త్వరలోనే వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా నీటిని విడుదల చేయించుకుందామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

 

Back to Top