విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యానికి ప్రాధాన్యం

 విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

పిల్లల విద్యా ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యం
 
సీఎం  వైయస్‌ జగన్‌పై నారా లోకేష్‌ అనుచిత వ్యాఖ్యలు
 
 ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు

పిల్లలు, తల్లిదండ్రుల్లో గందరగోళానికి ప్రయత్నిస్తున్నాడు

లోకేష్‌ను అందరూ వెర్రినాయుడు అని అంటున్నారు

పిల్లలకు మేనమామగా సీఎం వారిని చదివిస్తున్నారు

 విద్యార్థుల భవిష్యత్తు కోసమే సీఎం నిర్ణయాలు

మంగళగిరి: క‌రోనా నేప‌థ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తామ‌ని మంత్రి ఆదిమూల‌పు సురేష్ పేర్కొన్నారు. టీడీపీ నేత నారా లోకేష్ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి తీవ్రంగా ఖండించారు. పిల్ల‌ల‌కు మేన‌మామ‌గా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వారిని చ‌దివిస్తున్నార‌ని గుర్తు చేశారు. కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ చర్యలపై ఏర్పాటైన మంత్రుల బృందం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సమావేశమైంది. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో సమావేశమైన మంత్రుల బృందం, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని అంశాలను చర్చించింది. ఈ సంద‌ర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడారు. 

స్కూళ్లు, హాస్టళ్లకు సెలవులు:
    ‘కరోనా వ్యాప్తి నేపథ్యంలో 1 నుంచి 9వ తరగతి వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించి, అందరు విద్యార్థులను పై తరగతికి ప్రమోట్‌ చేయాలని నిర్ణయించాము. అదే విధంగా పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు యథావిథిగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇంకా వివిధ రెసిడెన్షియల్‌ స్కూళ్లు.. గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 9వ తరగతి వరకు సెలవులు ప్రకటించి, హాస్టళ్లు కూడా మూసివేయడం జరిగింది’. 

వర్సిటీలపై అన్ని కోణాల్లో..:
    ‘యూనివర్సిటీలలో కూడా తరగతులు, పరీక్షల నిర్వహణపై అన్ని కోణాల్లో సమీక్షించి, మరోసారి సమావేశం అవుతాము. సరైన సమయంలో సరైన  నిర్ణయం తీసుకోవాలని తీర్మానించాం. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా కోవిడ్‌ నిబంధనలను పాటిస్తాం. అతి సున్నితమైన సమస్య. ఎంతో ప్రమాదకరంగా కరోనా వ్యాపిస్తోంది’.

లోకేష్‌ అవాకులు చెవాకులు:
    ‘విద్యార్థులకు ఆత్మస్థైర్యం ఇవ్వాలని, అలగే విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటుంటే, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌పై లోకేష్‌ అవాకులు, చెవాకులు పేలుతున్నాడు. లోకేష్‌ వాడిన పదజాలం, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయం. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. లోకేష్‌ నిజంగా ఉన్నత చదువులు చదివి ఉంటే, ఆ డిగ్రీలు నిజమే అయితే, చదువు విలువ తెలిసిన వాడైతే సీఎం నిర్ణయాన్ని తప్పు పట్టడు. గత ఏడాది విద్యా సంవత్సరం నష్టపోయింది. విద్యార్థులకు మళ్లీ నష్టం కలగకుండా, విద్యా సంవత్సరాన్ని గాడిలో పెడుతూ, విద్యార్థుల మేలు కోసం ఈ నిర్ణయం తీసుకుంటే, ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని, జూమ్‌ కాన్ఫరెన్సులో హైదరాబాద్‌ నుంచి మాట్లాడుతున్నాడు. అక్కడ ఆయన ఉండి, ఇక్కడ పిల్లల గురించి మాట్లాడుతున్నాడు’.

వెర్రినాయుడు అంటున్నారు:
    ‘లోకేష్‌ ఒక అజ్ఞాని అని రుజువు చేసుకున్నాడు. అందరూ ఆయనను వెర్రినాయుడు అంటున్నారు. ఈ అవకాశాన్ని ఆయన రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాడు. నిజానికి సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పిల్లలకు మేనమామగా వారిని చదివిస్తూ, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ, బాగా చదువుకోవాలని ఫీజులు చెల్లిస్తూ, హాస్టల్‌ ఖర్చులు కూడా భరిస్తూ,  ఎన్నో చేస్తున్నారు. కానీ, లోకేష్‌ నీకు మాదిరిగా ఎవరో ఫీజు కడితే, ఎవరో పరీక్ష రాస్తే నీవు పాస్‌ అయ్యావు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్నానని చెబుతావు’.

సంతోషంగా విద్యార్థులు:
    ‘కానీ ఇక్కడ విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెట్టడం, నాడు–నేడుతో స్కూళ్లలో సమూల మార్పులు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. ఒక్క ఏడాదిలోనే దాదాపు 4.5 లక్షల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చేరారు’.

బురద చల్లే ప్రయత్నం:
    ‘పరీక్షలు నిర్వహిస్తే దాదాపు 70 లక్షల మంది విద్యార్థులకు కరోనా సోకుతుందని లోకేష్‌ చెబుతున్నాడు. కరోనా వస్తుందని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. సీఎం గారిపై బురద చల్లే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. వకీల్‌సాబ్‌ సినిమాను నాలుగు కాదు, ఆరు షోలు వేయాలని చంద్రబాబు అన్నాడు. దాన్ని రాజకీయం చేసి తిరుపతి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసినప్పుడు, లోకేష్‌ ఎక్కడికి పోయావు? అప్పుడు నీకు కరోనా ముప్పు కనిపించలేదా? నీకు అవేవీ కనబడవు. ఎందుకంటే వకీల్‌సాబ్‌ సినిమాతో రాజకీయ ప్రయోజనం పొందాలని చూశావు’.
    ‘ప్రజలు ఒకే చోట చేరితే కరోనా వ్యాపిస్తుందని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తిరుపతి ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకుంటే అర్ధం లేని విమర్శలు చేశారు. దాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ దాదాపు 70 లక్షల విద్యార్థుల ఆరోగ్య భద్రత గురించి ఏదేదో మాట్లాడుతున్నారు’.

ఆ విషయాలు తెలుసుకో..:
    ‘లోకేష్‌ గారు మీరు జూమ్‌ కాన్ఫరెన్సు ద్వారా పిల్లల భద్రత బాధ్యత తీసుకున్నారని మీరు భావిస్తే.. కరోనా వచ్చినప్పటి నుంచి పిల్లల శ్రేయస్సు, ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఏమేం చేసిందో ఒక్కసారి తెలుసుకో. శానిటైజ్‌ చేయడం, పిల్లల్లో అవగాహన పెంచడం వంటి ఎన్నో చర్యలు. విద్యామృతం, టీవీల్లో, రేడియోల్లో కార్యక్రమాలు, ఇంటర్నెట్‌ స్ట్రీమింగ్‌ ద్వారా కార్యక్రమాల ద్వారా ఏదో విధంగా 10వ తరగతి పరీక్షల కోసం సీఎం గారు ఎంతో కృషి చేశారు. దేశమంతా పిల్లలను ప్రమోట్‌ చేస్తే, ఇక్కడ గత ఏడాది 6వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించాము. విద్యా సంవత్సరం ముగిశాకే సెలవులు ఇచ్చాం. గత ఏడాది కూడా 10వ తరగతి పరీక్షలు నిర్వహించాము. అయితే సప్లిమెంటరీ మాత్రం నిర్వహించలేకపోయాము. నీవు ఏపీలో ఉంటే నీకు తెలిసేది. కానీ నీవు లేవు. అక్కడ హైదరాబాద్‌లోనే ఉండిపోయావు’.

నీవు చూడలేవు:
    ‘ఇక్కడ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, పరిస్థితిని గమనిస్తూ, పిల్లల ఆరోగ్యం, చదువు రెండూ ముఖ్యమని భావించి, ఆ దిశలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పిల్లల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు నీకు తెలియదు. ఎందుకంటే నీవు చూడలేదు. నీవు ఇక్కడ లేవు. ఇక్కడ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి, ప్రతి రోజూ రివ్యూ చేసి, పరీక్షలు నిర్వహించాం. ఎక్కడైనా ఒక్క కేసు బయటపడితే వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వíß ంచాం. పరిస్థితి చేయి దాటితే తక్షణమే వాయిదా కూడా వేశాం. స్కూళ్లు శానిటైజ్‌ చేశాం’.

మంత్రుల బృందం సమీక్ష:
    ‘కరోనా నివారణ కోసం ఏం చేయాలన్న దానిపై మంత్రులం సమావేశమయ్యాం. పరీక్షల నిర్వహణ, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలన్న దాన్ని చర్చించాము. వాటిపై సీఎం గారు తుది నిర్ణయం తీసుకుంటారు.
యూనివర్సిటీలలో కోర్సులు పూర్తి కాకపోతే ఏం చేయాలి? పరీక్షల నిర్వహణ ఎలా అన్న దానిపై ఛాన్సలర్‌ హోదాలో గవర్నర్‌ గారు కూడా సమీక్షించారు. విద్యార్థులు సంయమనం కోల్పోవద్దని, సమస్య పరిష్కారంలో కలిసి రావాలని గవర్నర్‌ గారు కోరారు. దాన్ని లోకేష్‌ చూసి ఉంటే బాగుండేది’.

లోకేష్‌ది బాధ్యతా రాహిత్యం:
    ‘ప్రజా ప్రతినిధిగా లోకేష్‌ కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఆయన ఎమ్మెల్సీ. అది ఎలా అయ్యాడో కూడా అందరికీ తెలుసు. కానీ పూర్తి బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాడు. విపత్కర పరిస్థితులలో ఏ విధంగా విద్యా సంవత్సరాన్ని ముందుకు తీసుకుపోవాలన్న దానిపై సూచనలు, సలహాలు ఇవ్వాల్సింది పోయి, విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎల్లో మీడియాలో వార్తలు రాయించి, రాజకీయ ప్రయోజకం కోసం చూస్తున్నాడు’.

పూర్తి బాధ్యతగా ప్రభుత్వం:
    ‘కానీ ప్రభుత్వం మాత్రం పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తోంది. అందుకే 9వ తరగతి వరకు సెలవులు ప్రకటించి, హాస్టళ్లు కూడా మూసివేసింది. ఎక్కడైనా సరే కోవిడ్‌ కేర్‌కు అనుగుణంగా వ్యవహరిస్తోంది. ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాం’.

సంయమనం పాటించండి:
    ‘విద్యార్థులకు ఒకటే విజ్ఞప్తి. సంయమనం పాటించండి. సెలవులు ప్రకటించాం కాబట్టి, ఇక్కడా అక్కడ తిరగకండి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడం కోసం ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తుంది’.

ఉపేక్షించబోము:
    ‘ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో విద్యార్థులు మాస్కులు ధరిస్తున్నారు. కానీ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో దాన్ని పక్కాగా అమలు చేయడం లేదు. యాజమాన్యాలు విచ్చలవిడిగా వదిలేస్తున్నారని సమాచారం
ఉన్నత విద్యా రంగంలో ఏ విద్యా సంస్థలో అయినా ఎస్‌ఓపీ పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు’.

Back to Top