విజయవాడ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఎంసెట్ సహా అన్ని ఎంట్రన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. జాతీయ ఎంట్రన్స్ పరీక్షలకు ఆటంకం కలగకుండా సెప్టెంబర్ 3వ వారంలో ఎంసెట్ పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ సూచనల మేరకు ఎంసెట్ సహా 8 పరీక్షలు వాయిదా వేసినట్లు వివరించారు. పరీక్షలకు సంబంధించిన అన్ని అంశాలపై సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు. వాయిదా వేసిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఆన్‌లైన్ కోర్సుల విధివిధానాలను త్వరలో రూపొందిస్తామని చెప్పారు.