వచ్చారు జగన్‌..మెచ్చారు జనం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌
 

చిత్తూరు: నాడు కావాలి జగన్‌..రావాలి జగన్‌ అంటే..ఇవాళ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ వచ్చారని, అన్ని వర్గాల జనం మెచ్చారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. చిత్తూరులో ప్రారంభించిన అమ్మ ఒడి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడ్డ రోజు ఇది. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని, ఈ రోజు అక్షర సేద్యం చేస్తున్న శ్రామికుడు వైయస్‌ జగన్‌ అని గర్వంగా చెబుతున్నాను. ఎన్ని ఇబ్బందులు ఉన్నా..ఎన్ని విమర్శలు చేసినా..తాను నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన వ్యక్తుల కోసం పోరాటం చేస్తున్నారు. అలాంటి పోరాటయోదుడికి సైనికులుగా నిలబడ్డాం. చదువులు చెప్పే విద్యాశాఖకు దళితుడినైన నన్ను చేయడం గొప్ప విషయం. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటా. రావాలి జగన్‌..కావాలి జగన్‌ అని నాడు నినాదాలు ఇచ్చాం. నేడు వచ్చాడు జగన్‌..మెచ్చారు జనం అని అందరూ అంటున్నారు. అంబేద్కర్‌ భావాజాలం..వైయస్‌ఆర్‌ రూపకల్పనే జగనన్న అమ్మ ఒడి. జనమంటే జగన్‌..జగన్‌ అంటే జనం అంటూ నినదించారు. ఈ పథకాన్ని అందరికి అందుబాటులోకి వచ్చేలా సుమారు 43 లక్షల తల్లులకు వర్తిస్తున్నాం. 
 

Back to Top