మెట్టు గోవింద‌రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

హైదరాబాద్‌ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల వరద కొనసాగుతోంది. టీడీపీ నేతలు ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వైయ‌స్ఆర్‌ సీపీ తీర్థం పుచ్చుకోగా... తాజాగా  అనంత‌పురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ మెట్టు గోవింద‌రెడ్డి వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో బుధవారం వైయ‌స్ఆర్‌ సీపీలో చేరారు. టీడీపీలో అవమానాలు భరించలేకే ఆ పార్టీకి రాజీనామా చేశామని ఆయ‌న‌ చెప్పారు.  వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని వ్యాఖ్యానించారు.  

Back to Top