కాపులకు గౌరవం ఇచ్చింది వైయస్‌ఆర్‌ కుటుంబం మాత్రమే

చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పవన్‌ తాపత్రయం

కులాన్ని భ్రష్టుపట్టించే విధంగా కుట్ర రాజకీయం చేస్తున్నాడు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కాపు నేతలు ధ్వజం

గుంటూరు: కాపులకు పూర్తిస్థాయిలో సహాయం అందించి వారి పక్షాన నిలిచింది వైయస్‌ఆర్‌ కుటుంబం మాత్రమేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కాపు నేతలు అన్నారు. గుంటూరులో వైయస్‌ఆర్‌ సీపీ కాపు ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో కాపులకు జరుగుతున్న మేలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, కులాన్ని అడ్డం పెట్టుకొని పవన్‌ వ్యవహరిస్తున్న తీరుపై చర్చించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్‌ కల్యాణ్‌ తాపత్రయపడుతున్నాడని మండిపడ్డారు. టీడీపీ హయాంలో కాపులను చంద్రబాబు తీవ్రంగా మోసం చేశాడని గుర్తుచేసుకున్నారు. 

వైయస్‌ఆర్‌ కుటుంబం కాపు సామాజిక వర్గానికి అత్యంత గౌరవం ఇస్తుందన్నారు. నాడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కాపుల అభివృద్ధి కోసం కృషి చేశార‌ని, నేడు సీఎం వైయస్‌ జగన్‌ కాపుల అభ్యున్నతికి పాటుపడుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించుకొని కాపు సమాజ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించినట్టుగా వివరించారు.  

పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ ఎందుకు పెట్టాడని వైయస్‌ఆర్‌ సీపీ కాపు నేతలు ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ సీపీలోని కాపు నేతలు, ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేసి కులాన్ని భ్రష్టుపట్టించే విధంగా పవన్‌ కుట్రపూరిత రాజకీయం చేస్తున్నాడన్నారు. చంద్రబాబు మొదటి నుంచి కాపు ద్రోహి అని, వంగవీటి మోహనరంగాను హత్యచేయించాడని, ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చాడని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ను చంద్రబాబు వాడుకుంటున్నాడని, కాపు సోదరులంతా మేలుకోవాలని సూచించారు. 
 

Back to Top