స్కూల్స్ మ్యాపింగ్ పై విద్యాశాఖ అవగాహనా సదస్సు 

విజ‌య‌వాడ‌: జాతీయ విద్యా విధానం లో భాగంగా స్కూల్స్ మ్యాపింగ్ పై విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో గురువారం అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు.  మ్యాపింగ్ చేసే విధానంపై మంత్రులు ఆదిమూల‌పు సురేష్, తానేటి వ‌నిత‌, సీదిరి అప్ప‌ల‌రాజు అవ‌గాహ‌న క‌ల్పించారు. స్కూల్ మ్యాపింగ్‌లో భాగంగా ప్రతి మండలంలో ఉన్న ప్రతి ప్రాధమిక పాఠశాల 3 కిలోమీట‌ర్ల‌ లోపులో ఉన్న ఉన్నత పాఠశాలకు జతచేయాలి. ఒకవేళ ప్రాధమిక పాఠశాల కు 3 km లోపులో ఉన్న ఉన్నత పాఠశాలకు అందుబాటులో లేక‌పోతే 3 km లోపులో ఉన్న ప్రాధమికోన్నత పాఠశాలకు జతచేయాలి. ఒకవేళ ప్రాధమిక పాఠశాల‌లు హైస్కూల్‌కు  యూపీఎస్‌కు కలపకుండా ఉన్న వాటికి కారణాలు కూడా రాయాల‌ని స‌ద‌స్సులో సూచించిన‌ట్లు స‌మాచారం.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top