వినాయక చవితి వేడుకలకు ఎటువంటి ఆంక్షలు లేవు..

వైయ‌స్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు  

సోము, బాబు... వినాయకుడు మిమ్మల్ని క్షమించడుః మల్లాది విష్ణు

వినాయక మండపాలకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదు

మండపాలకు విద్యుత్ స్లాబ్ ధర తగ్గించింది మా ప్రభుత్వమే

అప్పుడైనా, ఇప్పుడైనా 9 రోజుల మైక్ పర్మిషన్ కు వెయ్యి రూపాయలే.

రుసుముల విషయంలో మా ప్రభుత్వం ఎటువంటి కొత్త నిబంధనలు తీసుకురాలేదు

దేవుడ్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న సోము వీర్రాజు, చంద్రబాబులపై కేసులు పెట్టాలి

మీ హయాంలో గుడులు కూల్చినప్పుడే హిందుత్వానికి విఘాతం కలిగింది

తాడేప‌ల్లి: వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిబంధనలు తీసుకురాకపోయినా .. ప్రభుత్వం పండుగలు జరుపుకోకుండా ఇబ్బందులు పెడుతోందని, ఆంక్షలు విధిస్తుందంటూ పదేపదే మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నార‌ని వైయ‌స్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.  ఇవి పూర్తిగా అసత్యాలు. ఈ గాడిదలు, వెధవలకు రాజకీయం చేయడానికి ఏ విషయం లేకపోవడంతో ఆఖరికి వినాయకుడి పండుగనూ రాజకీయం చేస్తున్నారు. వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని స్ప‌ష్టం చేశారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మ‌ల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు.

మండపాలకు విద్యుత్ స్లాబ్ ధర తగ్గించింది మా ప్రభుత్వమే
    తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో వినాయక చవితి మండపాలకు విద్యుత్‌ సరఫరాకు సంబంధించి 500 మెగావాట్‌ లోడు వరకూ వెయ్యి రూపాయలు వసూలు చేశారు. దానికి ఇదిగో డాక్యుమెంట్ ఎవిడెన్స్. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ నిబంధన అమల్లో ఉంది. అదే, మేము అధికారంలోకి వచ్చాక వినాయక చవితి పందిళ్ల విషయంలో ఆ స్లాబ్‌ను తగ్గించి ... వెయ్యి రూపాయిలను రూ. 500 చేసిన ఘనత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి ప్రభుత్వానిదే. మరోసారి చెబుతున్నాం... మేము అధికారంలోకి వచ్చాకే వినాయక మండపాలకు విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాం. అప్పుడైనా, ఇప్పుడైనా 9 రోజుల మైక్ పర్మిషన్ కు వెయ్యి రూపాయలే.  వాస్తవాలు ఇలా ఉంటే, టీడీపీ- బీజేపీ వాళ్లు ఇంత అడ్డగోలుగా ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.

రుసుముల విషయంలో మా ప్రభుత్వం ఎటువంటి కొత్త నిబంధనలు తీసుకురాలేదు
        మేము అధికారంలో వచ్చాక మండపాలకు విద్యుత్‌ ఛార్జీలు గానీ, పోలీస్‌ శాఖ, నగర పాలక సంస్థలు వసూలు చేసే రుసుముల విషయంలోనూ ఏవిధమైన కొత్త నిబంధనలు తీసుకురాలేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, అంటే 2014లో తీసుకువచ్చిన జీవో ప్రకారమే అన్నీ ఉన్నాయి. మండపాల వద్ద డీజేలు వాడవద్దని టీడీపీ సర్కార్‌ హయాంలోనే పోలీస్‌ శాఖ ఆదేశాలు ఇచ్చారు. ఇదిగో ఆ ఆర్డర్‌ కూడా మీడియాకు విడుదల చేస్తున్నాం. టీడీపీ- బీజేపీ సంయుక్త ప్రభుత్వంలో, అంటే 2014- 19 మధ్య కరెంట్‌ ఛార్జీలు పెంచిందీ, డీజేలు వాడవద్దని ఆదేశాలు జారీ చేసిందీ మీరే. మీరే ఆ నిర్ణయాలు తీసుకొని, వాటిని మాకు ఆపాదించడం చూస్తుంటే.. మిమ్మల్ని ఏమనాలో కూడా మాటలు రావడం లేదు, ఇటువంటి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్న మిమ్మల్ని అడ్డగాడిదలని పిలవాల్సిన అవసరం ఉంది.

సోము వీర్రాజు, చంద్రబాబులపై కేసులు నమోదు చేయాలి
    వినాయక చవితి పండుగను ఉపయోగించుకుని ప్రభుత్వంపై అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్న సోము వీర్రాజు, చంద్రబాబు నాయుడులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను, వారిపై కేసులు నమోదు చేయాలని పోలీస్‌ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. హిందూ పండుగులను రాజకీయం చేస్తూ, ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నవీరు అసలు హిందువులు, భారతీయులే కాదు. వీళ్లను ఏమానాలో కూడా అర్థంకాని పరిస్థితి.
- కరోనా సమయంలో.. కేంద్ర ప్రభుత్వం వినాయక చవితితోపాటు, ముస్లిం, క్రైస్తవుల పండుగలను సామూహికంగా జరుపుకోవద్దని కొన్ని మార్గనిర్దేశకాలు జారీ చేసింది. ఆ ఆదేశాలనే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసింది. దీనిపైనా అప్పట్లో విమర్శలు చేశారు. ఇటువంటి వారిని ఏమనాలి..?

మీరు గుడులు కూల్చినప్పుడే హిందుత్వానికి విఘాతం కలిగింది
        హిందుత్వానికి విఘాతం కలుగుతుందని బీజేపీ-టీడీపీ నేతలు ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు. వినాయకుడి పందిళ్లకు సంబంధించి పదే పదే రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. టీడీపీ- బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే విజయవాడ నగరంలో చంద్రబాబు, బీజేపీకి చెందిన మంత్రి మాణిక్యాలరావులు కలిసి 40 గుడులు కూల్చినప్పుడే హిందుత్వానికి విఘాతం కలిగింది. విజయవాడ కెనాల్‌ రోడ్డులో ఉన్న వినాయకుడి గుడి తొలగించడానికి ప్రయత్నం చేస్తే... దాన్ని మేము అడ్డుకోవడంతో మీరు వెనక్కి తగ్గిన విషయం వాస్తవం కాదా? అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అలాంటి మీకు విఘ్నేశ్వరుడి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, వాటిని ప్రభుత్వానికి ఆపాదించి,  రోడ్ల మీదకు వచ్చి రచ్చ చేస్తున్నారు. కానీ జగన్‌గారి ప్రభుత్వమే... విఘ్నేశ్వరుడికి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం కాణిపాకంలో ఆరు కోట్ల రూపాయల విలువైన బంగారు రథాన్ని తయారు చేయించిన్నది గుర్తుపెట్టుకుంటే మంచిది.

వీర్రాజుకు దమ్ముంటే...
        సోము వీర్రాజుకు, చేతనైతే, దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి పోలవరం నిధులు ఇప్పించవచ్చు కదా? తిరుపతిలో మీ అగ్ర నాయకులు ఏపీకి ప్రత్యేక హోదాపై చేసిన ప్రకటన మర్చిపోయారా? ఏపీకి అయిదేళ్లు కాదు.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో మీ నాయకులు అన్నారు కదా? నీకు దమ్ముంటే.. కేంద్రం దగ్గరకు వెళ్లి వాటిని సాధించుకురా సోము వీర్రాజు.  అంతేకానీ చిల్లర పనులు, చిల్లర రాజకీయాలు చేసేలా దిగజారవద్దు. టీడీపీ-బీజేపీ పాలనలో నిబంధనలు విధించినప్పుడు ఇవేమీ గుర్తురాలేదా..?. అప్పుడు మీ నోళ్ళు ఎందుకు పెగలలేదు..?.

వినాయక చవితి వేడుకలకు ఎటువంటి ఆంక్షలు లేవు..
        వినాయక చవితికి మా ప్రభుత్వం కొత్తగా ఏ నిబంధనలు మార్చలేదు. ఎలాంటి ఆంక్షలు లేవు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా సుఖఃసంతోషాలతో ఉండాలని, స్వేచ్ఛగా, వేడుకగా, భక్తిశ్రద్ధలతో వినాయకచవితి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. టీడీపీ, బీజేపీ దిగజారిపోయి చేస్తున్న రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. చివరకు దేవుడిపైన కూడా వీళ్ళు అరాచకాలు, అపచారాలు చేసేంత స్థాయికి దిగజారిపోయారు. పండుగలను కూడా వదలకుండా ప్రజలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారు. 

దేవుడిపై కూడా దుష్ప్రచారం చేసే వీళ్ళు బతకడం దండగ..
    వినాయక చవితిని శాంతియుతంగా జరుపుకునేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వాస్తవాలను ప్రజలకు తెలియచేసే విధంగా మాట్లాడాలే కానీ.. రాజకీయపార్టీలు నీచస్థితికి దిగజారిపోకూడదు.  భగవంతుడిపైన కూడా ఇలాంటి బోగస్‌ మాటలు, కల్పితాలను ప్రచారం చేసేవారు బతకడం కంటే.. ఆత్మహత్య చేసుకుంటే మంచిది. ప్రభుత్వంపై గోబెల్స్‌ ప్రచారం చేసేవారిమీద, అలాగే  ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్న టీడీపీ, బీజేపీపై పోలీసులు కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top