రెడ్‌క్రాస్ అవార్డు అందుకున్న‌ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు 

గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా స‌త్కారం
 

విజ‌య‌వాడ‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, విజ‌య‌న‌గ‌రం జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు ప్ర‌తిష్టాత్మ‌క ఇండియ‌న్‌  రెడ్ క్రాస్‌ అవార్డు అందుకున్నారు. విజయవాడ లబ్బిపేట ఎస్ కన్వెన్షన్ లో  రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్  చేతుల మీదుగా ఇండియన్ రెడ్ క్రాస్ అవార్డును మజ్జి శ్రీనివాసరావు అందుకున్నారు.  చీపురుప‌ల్లిలో సుమారు రూ.80ల‌క్ష‌ల‌తో నిర్మిత‌మ‌వుతున్న బ్ల‌డ్‌బ్యాంకు ఏర్పాటుకు శ్రీ‌నివాస‌రావు చేసిన కృషికి ఈ స‌త్కారం ల‌భించింది.  బ్ల‌డ్‌బ్యాంకు ఏర్పాటుకు పెద్ద‌మొత్తంలో విరాళాల‌ను స‌మ‌కూర్చ‌డానికి కృషి చేయ‌డ‌మే కాకుండా, ర‌క్త‌దానాన్ని ప్రోత్స‌హించినందుకు, లైఫ్ మెంబ‌ర్ల‌ను పెద్ద సంఖ్య‌లో చేర్పించినందుకు, 2020-21 సంవ‌త్స‌రానికి గానూ ఆయ‌న ఈ గౌర‌వాన్ని పొందారు.  ఈ అరుదైన పుర‌స్కారాన్ని పొందిన మ‌జ్జి శ్రీ‌నివాస‌రావును ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, నాయ‌కులు అభినందించారు.

తాజా వీడియోలు

Back to Top