చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. రామకుప్పం మండలంలోని బల్ల పంచాయతీకి చెందిన 15 టీడీపీ కుటుంబాలు ఆదివారం స్థానిక సర్పంచ్ విజయ్ థామస్, వైయస్ఆర్‌సీపీ మండల కన్వీనర్ విజలాపురం బాబురెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ భరత్ వారికి వైయస్ఆర్‌సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం.. టీడీపీ నుంచి వైయస్ఆర్‌సీపీలో చేరిన వారు మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్, రెస్కో డైరెక్టర్ థామస్, మైనారిటీ నేతలు అల్లాభక్షు, షేక్ అహ్మద్, మాజీ సర్పంచ్ గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు.