కొత్తపేట: అశేష జనవాహిని వెంట నడవగా కోనసీమ అంబేద్కర్ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సుయాత్ర సాగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు తరలివచ్చారు. జగనే మా నమ్మకం అంటూ... దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. కొత్తపేట శాసనసభ్యుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, చింతా అనురాధ, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు కన్నబాబు, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ... – సామాజిక సాధికార బస్సుయాత్ర ఎన్నికలు వస్తున్నాయనో...మరొకటనో చేయడం లేదు. ఆయా వర్గాలకు జగనన్న హయాంలో జరిగిన మంచిని చెప్పడం కర్తవ్యంగా భావించి చేస్తున్న యాత్ర ఇది. – సమాజంలో అణగారిన కులాలు ఎదగాలని అంబేడ్కర్, ఫూలేల వంటి మహానుభావులు ఎంతో కృషి చేశారు. –ఈ రాష్ట్ర చరిత్రలో సామాజిక న్యాయానికి తెరతీసింది నాడు వైఎస్సార్, నేడు ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డే. –2014లో బీజేపీ, జనసేనలతో టీడీపీ కలిసింది. 624 హామీలిచ్చారు చంద్రబాబు. ఎన్నికలు అయిపోగానే వాటిని మరిచిపోయాడు. మేనిఫెస్టోను చెత్త బుట్టలో పడేశారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలతో పాటు పేదలైన అందరినీ మోసం చేశాడు చంద్రబాబు. –ఈరోజు గుండెమీద చేయివేసుకుని మేము బాగా బతుకుతున్నామనే పేదలు, ఎస్సీలు,ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఎందరో కనిపిస్తారు. ఇందుకు కారణం జగనన్నే. ఆయన సంక్షేమ పథకాలే. –సామాజిక న్యాయానికి నాంది పలికిన జగనన్నే మన నాయకుడు. సామాజిక సాధికారత విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న జగనన్నను, మనం ఎప్పటికీ మరిచిపోమని మళ్లీమళ్లీ చెబుదాం. –సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా మన ఎదుగుదలకు చేయూతనిచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని మనం మళ్లీ గెలిపించుకోవాలి. అది మనకోసమే. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ... –సామాజిక సాధికార యాత్ర ఈ రాష్ట్రంలోనే ..కాదు దేశంలోనే చారిత్రాత్మకమైనది. గత పాలకుడు ఏ సామాజిక వర్గాలనైతే దగా చేశాడో, మోసం చేశాడో, అబద్దాలతో ముంచాడో ఆయనెవరో మనకు తెలుసు. – చంద్రబాబు ఒక మోసకారి. ఒక అబద్దాల కోరు. రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చేయని మోసకారి బాబు. బ్యాంకుల్లో తనఖా పెట్టిన మహిళల బంగారాన్ని వెనక్కు తెచ్చి ఇస్తానని ఇవ్వని దొంగబాబు చంద్రబాబు. –ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మాటలతో గాయపరిచిన కఠినాత్ముడు బాబు. అణగారిన వర్గాలను చులకనగా చూసిన దొంగనాయకుడు చంద్రబాబు. –మరి నేడు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ వారిని తన అక్కున చేర్చుకున్నాడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. వారికి చేయూత నివ్వడానికి అనేక సంక్షేమపథకాలు తెచ్చారు. –నేరుగా పేదలకు డబ్బు అందేలా డీబీటీ ద్వారా 2.36 కోట్లను అకౌంట్లలో వేశారు జగన్. ఇక నాన్ డీబిటీ ద్వారా మరో 2లక్షలపైగా కోట్లను అందించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ... –బీసీలకు రాజ్యాధికారంలో భాగం కల్పించారు జగనన్న. వారికోసం 56 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసిన ఘనత జగనన్నదే. –సామాజిక న్యాయం వైఎస్సార్‌సీపీలోనే దక్కుతుంది అన్నది నిరూపణ అయింది. –యువకుడైన మన జగనన్న ముఖ్యమంత్రిగా అణగారిన వర్గాల పాలిట ఇంటిదీపమై వెలుగులు పంచుతున్నారు. –జగనన్న సంక్షేమపథకాల మంచిని తట్టుకోలేక టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. –నాకు అమెరికాలో ఒక యువకుడు కలిశాడు. మా నాన్న రిక్షా తొక్కేవాడు. వైఎస్సార్ పుణ్యమా అని ఆయన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇంజినీరింగ్ చదివాను. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. లక్షల్లో జీతం తీసుకుంటున్నాను. మా కుటుంబ స్థితిగతులు మారిపోయాయి అని ఆనందంగా చెప్పాడు. –మహానేత వైఎస్సార్ తనయుడిగా జగనన్న ఇంగ్లీషుమీడియా చదువులు అందుబాటులోకి తెచ్చి..మన పిల్లలు ప్రపంచాన్ని జయించాలని కోరుకుంటున్నారు. శాసనమండలి ఛైర్మన్ మోషేన్‌రాజు మాట్లాడుతూ... –గత ప్రభుత్వాల కాలంలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగానే మిగిలిపోయింది. కానీ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అది ఒక విధానమయింది. –మనకు ఈ ప్రభుత్వం ఏంచేసింది అన్నది వివరించడానికే ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతోంది. –మహానుభావులు అంబేడ్కర్, ఫూలేల ఆలోచనలే స్పూర్తిగా తన పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి, బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగస్వాములు చేయడం గొప్ప విషయం. –అనేక సంక్షేమకార్యక్రమాలను అమలు చేయడం ద్వారా పేదల స్థితిగతులను మెరుగుపరచిన ప్రభుత్వం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే. –గతంలో డబ్బున్న పిల్లలు సూటు బూట్లతో స్కూళ్లకు వెళుతుంటే, ఇంగ్లీషు మాటలు మాట్లాడుతుంటే, పేదకుటుంబాల్లోని అమ్మానాన్నలు తమ లేమి తనాన్ని తలుచుకుని ఎంతగానో బాధపడ్డ రోజులున్నాయి. –కానీ నేడు జగనన్న ఆ సౌకర్యాలన్నీ పేదపిల్లలకు కల్పించారు. ఇంగ్లీషు చదువులు అందుబాటులోకి తెచ్చారు. కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడేలా ప్రభుత్వపాఠశాలలను తీర్చదిద్దుతున్నారు. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.... – మీరందరు విజ్ఞులు, ఆలోచనపరులు. ఈ నాలుగున్నరేళ్లలో జగనన్న చేసిన కార్యక్రమాలను ఓ సారి సమీక్షించుకోమని కోరుతున్నాను. – ఏ పరిస్థితుల్లో జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో వచ్చారో గమనించండి. అంతకు ముందు బాబు పాలనలో అన్నీ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఖజానా ఖాళీగా ఉంది. అన్నీ సమస్యలే. చంద్రబాబు అప్పులు వదిలి మరీ దిగిపోయారు. –ఇక్కడ నూటికి 67మందికి వ్యవసాయమే ఆధారం. రాష్ర్టంలో 52లక్షల మంది రైతులున్నారు. 1.45 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయానికి కేటాయించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదే. మన తరఫున ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కడుతుంది. వడ్డీలేని రుణాలు రైతులకు ఇచ్చిన రాష్ట్రం మనదే. అది జగన్‌మోహన్ రెడ్డి పాలన వల్లే సాధ్యమైంది. – ఈ రాష్ట్రంలో సంక్షేమపథకాల ద్వారా లబ్ది పొందని కుటుంబం ఒక్కటీ ఉండదు. సమర్ధవంతపాలన, మానవత్వం కలిగిన పాలన అందరం చూస్తున్నాం. – ప్రతి క్షణం పేదలకు మంచి చేయాలని తపించే ప్రజానాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఆయనను అందరూ ఆశీర్వదించండి. –జగన్‌మోహన్‌రెడ్డిని మనం వదులుకుంటే..మన సంక్షేమాన్ని మనమే కాళ్లతో తన్నుకున్నట్టు. – బీసీలను జడ్జిలుగా నియమించకండి అన్న చంద్రబాబును నమ్మడమంటే..మనల్ని మనం మోసం చేసుకోవడమే. ఇలాంటి పనులు ఎన్నో చేశాడు చంద్రబాబు. – ఆయన ద్వారా ఎవరికీ న్యాయం జరగదు. బాబులాంటి నేత అవసరమనుకుంటే...భగవంతుడు కూడా మన ల్ని క్షమించడు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.... –జగనన్న అంటే యావత్ భారత దేశానికి రోల్‌మోడల్ నాయకుడు జగనన్న. –సచివాలయాలు, ఆర్బీకేలు,హెల్త్‌సెంటర్లు, ఆస్పత్రులు వేల సంఖ్యలో తెచ్చిన జగనన్న...పేద ప్రజలకు అవసరమైన అన్ని సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. –రూ.1000ల పెన్షన్ కోసం క్యూలైన్లలో నాడు అవ్వాతాతలు నిలబడితే. జగనన్న పాలనలో తీరుమారింది. అదే పెన్షన్ నేడు రూ.2750కు పెంచి, ఇంటిదగ్గరకే వచ్చి అందించే వ్యవస్థను తీసుకువచ్చారు జగనన్న. వచ్చే జనవరి నుంచి మూడువేలకు పెంచుతున్నారు. –నాడు–నేడు ద్వారా విద్యావ్యవస్థలోను, ఆరోగ్యరంగంలోను విప్లవాత్మకమార్పులు తెస్తున్నారు జగనన్న. ఎంపీ చింతా అనురాధ మాట్లాడుతూ.... – ఈరోజు మేమందరం ఇలా మీ ముందు ఉన్నామంటే జగనన్న వల్లనే. –సంక్షేమపథకాలు ప్రతి ఇంటికీ అందేలా...వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిదే. – సామాజిక సాధికారత, మహిళా సాధికారితల విషయంలో ఒక సామాజిక విప్లవకారుడిగా ముఖ్యమంత్రి పనిచేశారు. నిజంగా ఆయనలో ఒక సంఘసంస్కర్త ఉన్నారు. – మంచిపాలన, మంచి నాయకుడు కావాలంటే మళ్లీ జగనన్ననే గెలిపించుకోవాలి. ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ.... –సామాజిక సాధికారత విషయంలో ఈ రాష్ట్రంలో ఎవరు గట్టిగా పనిచేశారని చరిత్రలో రాస్తే...జగన్‌మోహన్‌రెడ్డి పేరు రాయాల్సిందే. – పేదల తరఫున నిలబడి పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. పేదల కళ్లల్లో వెలుగులు చూడటానికే జగనన్న నిరంతరం పనిచేస్తున్నారు. –జగనన్నే మా నమ్మకం అని మళ్లీ మళ్లీ నినదిద్దాం. –సామాజిక సాధికారత సాధించాలి అని కలలు కన్నవారి...కలల్ని నిజం చేసిన నాయకులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి