నారా లోకేష్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ ఝలక్‌

విద్యార్థుల జూమ్ మీటింగ్ నుంచి పారిపోయిన లోకేష్‌

అమరావతి: టీడీపీ నేత నారా లోకేష్‌కు మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఝలక్‌ ఇచ్చారు. విద్యార్థులతో నారా లోకేష్‌ నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులతో పాటు కొడాలి నాని, వల్లభనేని వంశీ పాల్గొన్నారు. వీరిద్దరిని చూడగానే కంగుతిన్న లోకేష్‌ వెంటనే జూమ్‌ లైవ్‌ను కట్‌ చేశారు.

టెన్త్‌ విద్యార్థులతో నారా లోకేష్ జూమ్‌ మీటింగ్ పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. ఆ మీటింగ్‌లోకి వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఎంట్రీ ఇవ్వడంతో లోకేష్ త‌ప్పుకున్నాడు.  ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా కో-ఆర్డినేట‌ర్ దేవేందర్‌రెడ్డి లోకేష్‌తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే వీడియోలు కట్ చేశారు.   దేవేందర్‌రెడ్డి  లోకేష్‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు. మీరు చేసేది కరెక్టేనా, విద్యార్థులతో రాజకీయం చేస్తారా అంటూ లోకేష్‌ను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఈలోపే ఆడియో, వీడియో కట్‌ అయింది.  పిల్లలకు పరీక్షలు పెట్టొదని ఎందుకు చెప్పాలంటూ నారా లోకేష్‌ను నిలదీశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top