జూన్‌ 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కీలక నిర్ణయం

తాడేపల్లి: కరోనా నియంత్రణ దృష్ట్యా రాష్ట్రంలో అమలవుతున్న కర్ఫ్యూ ఈనెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈనెల 20వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగిస్తే.. మెరుగైన ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, జూన్‌ 10వ తేదీ తరువాత కర్ఫ్యూ సడలింపు సమయం పొడిగించనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిత్యవసర సరులకు కొనుగోలు, వ్యాపార కార్యకలాపాలకు అనుమతివ్వనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలందించనున్నాయి. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top