చంద్రబాబుకు ఓట్లు వేస్తే వర్షాలు రావు

కాటసాని రాంభూపాల్‌రెడ్డి

కర్నూలు: చంద్రబాబుకు ఓట్లు వేస్తే వర్షాలు రావని వైయస్‌ఆర్‌సీపీ పాణ్యం నియోజకవర్గ అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. పాణ్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీని గెలిపించి వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అందరం చేయి చేయి కలుపుదామని కోరారు. మనందరం కూడా ఆలోచించాల్సింది ఒక్కటే. మన నేత వైయస్‌ జగన్‌ ఏప్రిల్‌ 11న జరిగే ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు.రాష్ట్రంలోని సంక్షేమ పథకాల గురించి ఆలోచించే నాయకుడు వైయస్‌ జగన్‌ మాత్రమే అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో 14 నెలల క్రితమే పింఛన్లు పెంపు, రైతు భరోసా ప్రకటించారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తనకు రాజకీయ అవకాశం కల్పించారన్నారు. ఆ రోజు వైయస్‌ఆర్‌తో కలిసి పని చేసి ప్రజల మన్ననలు పొందామన్నారు. నవరత్నాలు ప్రతి ఒక్క పేదవారికి మేలు జరుగుతుందన్నారు. పాణ్యం నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌సీపీ జెండా ఎగురవేద్దామని, జగనన్నకు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ఓటు వేస్తే వర్షాలు రావన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన రావాలంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

 

Back to Top