బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

అధికార దాహంతో బీసీలను వంచన చేస్తున్నారు

వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కండ్రు కమల

హైదరాబాద్‌: చంద్రబాబు బీసీల గర్జన అంటూనే బీసీలను రాజకీయంగా అణగదొక్కేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ జగన్‌ నివాసంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల జననేత సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ కాండ్రు కుటుంబ సభ్యులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అధికార దాహంతో ప్రజలకు చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెబుతున్నారన్నారు. బీసీలను అణగదొక్కుతూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి పక్కనబెట్టి కుటుంబ అభివృద్ధి కోసం చంద్రబాబు పాలన చేస్తున్నాడన్నారు. మంగళగిరి టికెట్‌ బీసీలకు ఇస్తామని చెప్పి వంచించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీని వీడి వైయస్‌ఆర్‌ సీపీలో చేరడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ అప్రమత్తం కావాలని, వంచన చేస్తున్న చంద్రబాబును ఓడించాలని కోరారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం మళ్లీ చూడొచ్చనే ఉద్దేశంతో పార్టీలో చేరడం జరిగిందన్నారు. గుంటూరు జిల్లాలో వైయస్‌ జగన్‌ ముగ్గురు మహిళలను బరిలోకి దించితే.. చంద్రబాబు మాత్రం ఒకే సామాజికవర్గానికి చెందిన వారికి టికెట్లు కేటాయించారని మండిపడ్డారు. 

టికెట్‌ ఇస్తానని మోసం చేశారు..: షోకత్‌

టికెట్‌ ఇస్తానని చంద్రబాబు, గల్లా జయదేవ్‌ మోసం చేశారని టీడీపీ నుంచి గుంటూరు ఈస్ట్‌ టికెట్‌ ఆశించి భంగపడిన షోకత్‌ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో షోకత్‌ వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం షోకత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. మైనార్టీలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వైయస్‌ఆర్‌ సీపీ గుంటూరు ఈస్ట్‌ అభ్యర్థి ముస్తఫా, వెస్ట్‌ యేసురత్నం, గుంటూరు ఎంపీ మోదుగులను గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top