వైయ‌స్ఆర్ సీపీలో చేరిన కైక‌లూరు జ‌న‌సేన నేత‌లు

ఏలూరు జిల్లా: ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కీలక నేతలు, యాదవ సంఘం నేతలు వైయ‌స్ఆర్ సీపీలో జాయిన్ అయ్యారు. 16వ రోజు మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌లో భాగంగా నారాయణపురం స్టే పాయింట్‌ వద్ద వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో కైకలూరు నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ బీ.వీ. రావు, జిల్లా కార్యదర్శి పల్లెం యువాన్, యాదవసంఘం నేత పచ్చిగోళ్ల రామకృష్ణ వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వారికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు,  కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఇతర నేతలు పాల్గొన్నారు. 

Back to Top