కుర్చీ కోసమే క‌డ‌ప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆరాటం 

టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు శ్రీ‌నివాసులురెడ్డి అవినీతిపై సొంత పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు

కడప మేయర్ సురేష్ బాబు ఫైర్‌

వైయ‌స్ఆర్ జిల్లా:  క‌డ‌ప టీడీపీ ఎమ్మెల్యే మాధ‌విరెడ్డి ఆరాట‌మంతా అభివృద్ధి కోసం కాద‌ని.. కుర్చీ కోసమే అంటూ క‌డ‌ప మేయ‌ర్ సురేష్‌బాబు విమ‌ర్శించారు. ఎమ్మెల్యే భ‌ర్త‌, టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు శ్రీ‌నివాసులురెడ్డి అవినీతికి అంతే లేద‌ని సొంత పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ` అభివృద్ధి గురించి శ్రీ‌నివాసులురెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. కూటమి పాలనలో ఒక్క అభివృద్ధి పని అయినా చేశారా? మిమ్మల్ని చూసి టీడీపీ నాయకులే అసహ్యించుకున్నారు. శ్రీనివాసులు రెడ్డి  అవినీతి భాగవతం గురించి సొంత పార్టీ వాళ్లే చర్చించుకుంటున్నారు. బుగ్గవంక పనుల్లో నువ్వెంత దోచుకున్నావో తెలుసు. రూ.30లక్షల పనికి మూడు కొట్లు ఖర్చు చేసి దోచుకున్న మాట వాస్తవమా కాదా..?   టీడీపీ ఎమ్మెల్యే మాధ‌విరెడ్డి ఓ నియంతలా వ్యవహారిస్తోంది. మేం చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ కాలర్ ఎగరేసుకొని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఓట్లు అడగడానికి ప్రజల్లోకి వెళ్తాం. ఎమ్మెల్యే గా గెలిచిన మాధవి రెడ్డి కడపకు ఎంత మేర నిధులు తెచ్చారో చెప్పే దమ్ము దైర్యం ఉందా? మా నిధులతో టెంకాయలు కొట్టడానికి సిగ్గులేదా? 
వేల కోట్లతో అభివృద్ధి చేసిన చరిత్ర వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీది.  పందికొక్కుల్లా మేసిన మీరా మమ్మల్ని విమర్శించేది. బుగ్గవంక బ్యూటిఫికెషన్ పనులు వైయ‌స్ హయాంలో రూ.70కోట్లతో చేప‌ట్టాం. ఎమ్మెల్యే మాధవి రెడ్డికి కుర్చీ ఇచ్చి గౌరవించాం. సర్వసభ్య సమావేశంలోనే సాటి మహిళను అవమానపరచిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కుర్చీ కోసమే ప్రాకులాడుతున్నార‌ని మాట్లాడటానికి సిగ్గుండాలి. కుర్చీ కుర్చీ అని ప్రాకులాడేది ఎవరో ప్రజలకు తెలుసు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన అజెండాను చించి వేసింది ఎమ్మెల్యే మాధవి రెడ్డి కాదా? ప్రజా సమస్యలపై తీర్మానం చేస్తే కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి అభివృద్ధి నిరోధకురాలు కాదా..?. 15వ ఫైనాన్స్ నిధులు కూడా రాకుండా చేసింది మీరు కాదా..?  మా హ‌యాంలో అవినీతి జరిగింద‌ని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా? నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా` అంటూ మేయ‌ర్ సురేష్‌బాబు ఎమ్మెల్యేకు స‌వాల్ విసిరారు. 

Back to Top