దేశం గర్వించదగ్గ వ్యక్తి జ్యోతిరావు పూలే 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జ్యోతీరావు పూలే జయంతి వేడుకలు.

పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు

తాడేప‌ల్లి: దేశం గర్వించదగ్గ వ్యక్తి జ్యోతిరావు పూలే  అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి కొనియాడారు. బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే సేవలు అందరికి మార్గదర్శకం అన్నారు. 
     మహాత్మాజ్యోతిరావూపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.పార్టీ కేంద్ర కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ముఖ్యఅతిధి శాసనమండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డితోపాటు ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవినవరత్నాల అమలు కమిటీ వైస్ ఛైర్మన్,నారాయణ మూర్తి,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్,ఏపీ శాలివాహన కుమ్మర కార్పొరేషన్ ఛైర్మన్ పురుషోత్తం,పార్టీ అధికారప్రతినిధి కాకుమాను రాజశేఖర్ లు కార్యక్రమంలో పాల్గొని పూలే బలహీనవర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను శ్లాఘించారు.

     ఈ సందర్భంగా లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ..భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు.పూలే ఆశయాలను తూచతప్పకుండా పాటిస్తూ అమలుచేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని అన్నారు. జ్యోతీరావుపూలే విధానాలు అమలు కావాలి అంటే మళ్ళీ సీఎంగా జగన్ విజయం సాదించాలన్నారు.బీసీల అభివృద్ధి కోసం పాటుపడిన స్వతంత్ర సమరయోధుడు పూలే అన్నారు.

          వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో ఎంపీ, ఎమ్మెల్యే 200 స్థానాల్లో బిసి, ఎస్సి, ఎస్టి,  మైనారిటీ లకు  కలిపి వంద స్థానాలు ఇచ్చిన వ్యక్తి వైయ‌స్ జగన్ అన్నారు. సామాజిక సాధికారిత అనేది ప్రకటనలకే పరిమితం కాదని చేతలలో చూపించినవ్యక్తి వైయస్ జగన్ అన్నారు. ఈ వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి వారికి చేయూత నివ్వడంతోపాటు 139 బిసి కులాల అభ్యున్నతికోసం 56కి పైగా  బీసీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసిన వ్యక్తి జగన్ అన్నారు.పేదల పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియం పెట్టిన నాయకుడు జగన్ అని నాడు నేడు ద్వారా అటు విద్యాలయాలను, ఆసుపత్రులను వేలాది కోట్ల రూపాయలతో ఆధునీకిరించారని అన్నారు, వైయస్సార్ కాంగ్రెెస్ పార్టీ ఎన్నికలలో 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు గెలవాలని కోరుకుంటున్నానని అన్నారు.కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
 

Back to Top