కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా వైయ‌స్ఆర్ సీపీ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జక్కంపూడి రామ్మెహన్ తనయుడే రాజా. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి జక్కంపూడి కుటుంబం...ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ వెంటే ఉన్నారు. మరోవైపు జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించడంపై కాపు సామాజిక వర్గనేతలు హర్షం వ్యక్తం చేశారు.

Back to Top