విజయనగరం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు చీపురుపల్లి నియోజకవర్గంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు మేరకు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను ). విజయనగరం పార్లమెంటు సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్ ( పెదబాబు) సూచనల మేరకు సోమవారం పోలాయవలస గ్రామం లో జగనన్నే మా భవిష్యత్తు అనే ఈ కార్యక్రమం నిర్వహించారు. మొల్లి అప్పన్న (మాజీ సర్పంచ్ , తెట్టంగి సచివాలయం కన్వీనర్ ) ప్రతీ గడపకు వెళ్ళారు. ఈ సందర్భంగా సచివాలయం కన్వీనర్ మొల్లి అప్పన్న మాట్లాడుతూ ..ఈ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించి . వారి అనుమతితో మొబైల్ స్టిక్కర్, కరపత్రాలు అందజేసినట్లు చెప్పారు. జగనన్న కు మద్దతు తెలిపే ప్రతి కుటుంబం 8296082960 నంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చే విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పారు. కార్యక్రమంలో సచివాలయం వాలంటీర్లు, గృహ సారథులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గరివిడి మండలం కోనూరు గ్రామంలో.. సర్పంచ్ బూడి శ్రీరాములు ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సచివాలయం కన్వీనర్ మీసాల అక్కు నాయుడు, గడి లక్ష్మి గారు గ్రామ వాలంటీర్స్, గృహసారధులు, గ్రామ పెద్దలు ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు వివరించి ప్రచార పత్రాలు పంపిణీ చేశారు. గుజ్జింగువలస గ్రామంలో.. సోమవారం ఉదయం 8:30 గంటలకు చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలం గుజ్జింగివలస గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా మా నమ్మకం నువ్వే జగనన్న.. ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గం పరిశీలకులు కే.వి.సూర్యనారాయణరాజు(పులిరాజు) ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి తిరుగుతూ స్వయంగా జగనన్న స్టిక్కర్లను ప్రజల అనుమతితో అతికించారు. ఇప్పటివరకు అందిన జగనన్న సంక్షేమ పథకాల గురించి వివరించి ప్రజల నుంచి మద్దతు తీసుకున్నారు. కార్యక్రమంలో మండల జేసీఎస్ కన్వీనర్ బెల్లాన బంగారు నాయుడు, జడ్పీటీసీ శీర అప్పల నాయుడు , ఎంపీపీ ప్రతినిధి పొట్నూరు సన్యాసి నాయుడు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచ్ వైస్ సర్పంచ్ , సచివాలయ కన్వీనర్లు, వాలంటరీలు, గృహసారథులు, కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు.