అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఆదివారం మూడో రోజు రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగింది. ఏ ఇంటికి వెళ్లినా ఆత్మీయ పలకరింపులు, ప్రభుత్వ పనితీరుపై ఎవరిని కదిపినా హర్షాతిరేకాలు.. మళ్లీ జగనన్నే సీఎం కావాలన్నది తమ ఆకాంక్ష అని ప్రజా మద్దతు పుస్తకంలో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు నమోదు చేశారు. వైయస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఇంటి తలుపు, మొబైల్ ఫోన్‌కు వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్‌లను ఇష్టంగా అతికించుకున్నారు.82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలిపారు. ఆ వెంటనే ఐవీఆర్‌ఎస్ కాల్ ద్వారా సీఎం వైయస్ జగన్ సందేశం రావడంతో ఆనందపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ఇదే సందడి కనిపించింది. తమ బాగోగులు కనుక్కోవడానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఇతర ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు, కన్వీనర్లు, వలంటీర్లకు ప్రజలు సాదర స్వాగతం పలికారు. దాదాపు నాలుగేళ్లుగా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం తమ వెంటే ఉందని, తమ బాగోగులు చూసుకుంటోందని సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో దగాకు గురైతే, సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం న్యాయం చేసిందని చెబుతున్నారు
నెల్లూరు జిల్లా:
►సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, మనుబోలు, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాల్లో జగనన్నే మా భవిష్యత్తు, మానమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో పాల్గొన్న గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు వైఎస్సార్‌సీపీ నాయకులు
►ప్రతి ఇంటికి వెళ్లి బుక్ లెట్, స్టికర్ అందించి సీఎం వైయస్ జగన్ స్టిక్కర్లను ఇళ్ల కు అంటించిన గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులు
గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేస్తున్న మేలును వివరించి.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా సాగిస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైయస్ఆర్ సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.
సీఎం వైయస్ జగన్ ప్రతినిధులుగా ఇంటికి వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, పార్టీ శ్రేణులు, వలంటీర్లకు కుటుంబ సభ్యులు ఎదురేగి ఆహ్వానించారు. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైయస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతోపాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా విన్పిస్తోంది.

నంద్యాల జిల్లా:
శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం అమలాపురం పరిధిలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు జగన్ అన్ననే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా సచివాలయ కన్వీనర్ ఆధ్వర్యంలో ప్రతి కుటుంబంలా దగ్గరికి వెళ్లి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వ్యత్యాసం తెలియజేస్తూ, ప్రభుత్వ పథకాలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబం అనుమతితో మా నమ్మకం నీవే జగనన్న స్టిక్కర్ను అతికించుకుంటూ కొనసాగుతున్న కార్యక్రమం మా నమ్మకం నువ్వే జగనన్న. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు , గ్రామసర్పంచి తిరుపాలు, సామన్న, ప్రతాప్, రమణయ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, సచివాల కన్వీనర్లు, గృహసారథులు,వాలంటీర్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.