తాడేపల్లి: ఏడాది కూటమి పాలనలో ఏపీలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా.. మహిళల గౌరవం పేరిట కూటమి నేతలు సాక్షి ఆఫీసులపై చేస్తున్న దాడులను, కొమ్మినేని అరెస్ట్ తదితర అంశాలను ఖండిస్తూ.. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్‌లకు ఆయన చురకలంటించారు. పారదర్శక, అవినీతి రహిత, న్యాయబద్ధమైన, అధికారులకు స్వేచ్ఛ.. అన్నింటికి మించి సంక్షేమ పథకాలతో సమర్థవంతంగా గత వైయస్ఆర్‌సీపీ పాలన కొనసాగింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వ ఏడాది పాలన మోసాలతోనే గడిచిపోయింది. ఇచ్చిన హామీలేవీ అమలు చేయకపోగా.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, జనాల దృష్టి మరలించేందుకు అలజడి సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఎలాంటి వ్యాఖ్యలు చేయని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. ఇది చట్టబద్ధంగా జరిగిన అరెస్ట్ కాదు.. రాజకీయ దురుద్దేశంతో జరిగిన అరెస్ట్. .. వాస్తవాలను వక్రీకరించి ఒక పథకం ప్రకారం సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు. మహిళల గౌరవాన్ని రక్షిస్తున్నామన్న నినాదం వెనుక ఈ ప్రభుత్వ లక్ష్యం ఒక్కడే.. సొంత ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించడం!. అలాంటప్పుడు ఇది నిజమైన మహిళా గౌరవ రక్షణా?. ఈ ఘటనలు వారి అసలైన వైఖరిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రజల ముందు ఒక ప్రచారాన్ని నిర్మించుకుంటూ.. నిజమైన విలువలను మాత్రం పూర్తిగా విస్మరిస్తున్నారని కింద వీడియోలు వెల్లడిస్తున్నాయి.. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?: చంద్రబాబు అమ్మాయిల వెంటపడమంటే ఊరుకుంటారా నా ఫ్యాన్స్. ఏమయ్యా.. ఊరుకోరు కదా. ఎళ్లి ముద్దైనా పెట్టాలి.. లేదా కడుపైనా చేసేయాలి అంతే.. అంతే కమిట్ అయిపోవాలి. ఏదో ఒకటి: నందమూరి బాలకృష్ణ విదేశీ యువతులతో డ్యాన్సులు వేస్తూ.. ఎంజాయ్ చేస్తున్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ https://x.com/ysjagan/status/1932422561054487014