తాడేపల్లి: జనసేన కార్యకర్తలు ఇక జనసైనికులు కాదు.. సైకిల్‌సైనికులు అని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ సైకిల్‌కు తప్పు పట్టింది.. టైర్లు లేవు.. చంద్రబాబు అవినీతి డబ్బుతో వారాహి యాత్ర జరుగుతోంది. జనసేన అవినీతి జెండా కూడా చంద్రబాబు అవినీతి డబ్బుతోనే ఎదుగుతోందన్నారు. కొండనాలికకు మందేస్తే.. ఉన్ననాలిక ఊడిందన్న చందాన వారాహి యాత్ర తయారైందని, చంద్రబాబుతో కలిసి వస్తున్నానని చెప్పగానే వారాహి-4 యాత్ర ఫ్లాప్ అయ్యిందన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.
మంత్రి అంబటి రాంబాబు ఏం మాట్లాడారంటే..
పూజ్య గాంధీ జయంతి సందర్భంగా దేశమంతా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అవినీతిపరుడు, దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తి, దేశ రాజకీయాలను విషపూరితం చేసిన చంద్రబాబు, అవినీతి కేసులో జైలుకు వెళ్లి, జైలులో ఈరోజు నిరాహార దీక్ష చేస్తుంటే, నిజంగా మహాత్మాగాంధీ ఆత్మ క్షోభిస్తుంది. అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన వారు కూడా మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నిరాహారదీక్షలు చేసి, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు నమ్మొద్దు.
ఆ సభపై ఆసక్తిగా చూసినా..
నిన్న (ఆదివారం) వారాహి 4వ విడత యాత్ర అవనిగడ్డలో ప్రారంభమైంది. దీనిపై రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా గమనించారు. పవన్ ఏం మాట్లాడతారు? ఆయనకు ఏ విధంగా ఆదరణ వస్తుంది? అన్న దాని కోసం వేచి చూశారు. ఎందుకంటే చంద్రబాబు అవినీతి కేసులో జైలుకి పోయిన తర్వాత, జైలు సాక్షిగా వచ్చే ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత జరుగుతున్న వారాహి యాత్ర కాబట్టి.. దానిపై అందరూ చాలా ఆసక్తి కనబరిచారు. పవన్ ఏం మాట్లాడతారా అని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూశారు.
అవనిగడ్డ పవన్ సభ అట్టర్ ఫ్లాప్..
తన సభలు విజయవంతం చేసుకోవడానికి పవన్ అనుసరిస్తున్న విధానాలు చూస్తే.. ఎక్కడైతే తన సామాజికవర్గం, కాపులు ఎక్కువగా ఉంటారో.. అక్కడ పవన్‌కళ్యాణ్ మీటింగ్స్ పెడుతున్నాడు. బహుశా ఇది నక్కజిత్తుల చంద్రబాబు సలహా అయి ఉంటుంది. ఎందుకంటే కాపులను డైవర్ట్ చేసి, తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం పవన్‌కళ్యాణ్‌ను ఉపయోగించుకోవాలని కొంత కాలంగా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో అవనిగడ్డలో సమావేశం పెట్టారు. ఎందుకంటే అక్కడ రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉంటే, వారిలో 70 వేల మంది కాపులు ఉన్నారు. ఆ నియోజకవర్గంలో కాపులు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ. అక్కడికి వెళ్తే పవన్‌కళ్యాణ్‌కు అద్భుతమైన ఆదరణ వస్తుంది. ఆయన సభ విజయవంతమవుతుంది అన్నది వారి ఆలోచన.
చంద్రబాబు, తాను కలిసి వస్తున్నామని ప్రకటించిన తర్వాత.. జరిగే సభ ఒక పెద్ద సందేశం ఇవ్వాలి. ఆనాడు ఈనాడులో రాశారు. ‘జనసేన తెలుగుదేశం కలయిక సూపర్‌హిట్’ అని ఫ్రంట్ పేజీలో వేశారు. ఏం జరగకుండానే ఆ పేపర్‌లో అలా రాశారు. అలా సూపర్‌హిట్ అవ్వాలనే ఒక వ్యూహంతో పవన్‌కళ్యాణ్ నిన్న అవనిగడ్డలో మీటింగ్ పెట్టారు. ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్ ట్వీట్ చేశాడు. పవన్‌కళ్యాణ్ మీటింగ్‌కు టీడీపీ శ్రేణులు తరలి వెళ్లాలని. వారాహియాత్రకు ప్రజలు తండోప తండాలుగా వెళ్లాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పిలుపినిచ్చాడు. దీంతో టీడీపీకి చెందినవారు కూడా కొందరు అక్కడికి వెళ్లారు. కానీ అవనిగడ్డలో వారాహి విజయయాత్ర ఫ్లాప్ అయింది. అట్టర్ ఫెయిల్ అయింది.
అవనిగడ్డలో పవన్ ను పట్టించుకోని కాపులు
పవన్ తనకు తానుగా వెళ్తే.. జనం బాగానే వచ్చేవారేమో. కానీ తాను చంద్రబాబుతో కలిసి వస్తున్నానని చెప్పడంతో.. కాపులు స్పందించ లేదు. అది దయనీయ పరిస్థితి. అవనిగడ్డలో మధ్యాహ్నం 3 గం.కు బహిరంగ సభ అన్నారు. మ. 2 గం.కే అక్కడికి వెళ్లిన పవన్‌కళ్యాణ్, నాగబాబులు.. కార్వాన్‌లో కూర్చున్నారు. అందరికీ ఫోన్ చేసి జనాలను తీసుకురావాలని కోరారు. చివరక సాయంత్రం 6 గం.లకు కొంత మంది రావడంతో, అప్పుడు వారాహి వాహనం ఎక్కిన పవన్ ప్రసంగించారు. ఇక్కడ ఒక విషయం గమనించండి. పవన్‌లో ఆత్మవిశ్వాసం లేకుండా పోయింది. ముఖంలో కళ తప్పింది. చంద్రబాబుతో కలిసి తాను ఎన్నికలకు వెళ్తున్నానంటే, జనం తండోపతండాలుగా వస్తారనుకుంటే.. అలా జరగలేదు. దీంతో ఆయనలో భయాందోళన మొదలైంది. అవనిగడ్డలో తన సామాజికవర్గమే ఎక్కువగా, ఉన్నా జనం రాలేదు. ఎందుకంటే.. ఆయనను ప్రజలు ఆదరించలేదు. పవన్ తప్పు చేశాడు. అవినీతిపరుడైన చంద్రబాబుతో కలిసి పోతున్నాడని అందరూ అనుకున్నారు కాబట్టే.. అవనిగడ్డ సభ టోటల్‌గా ఫెయిల్ అయింది. చంద్రబాబుతో కలిసి వస్తే.. నీకేం ఆదరణ ఉండదని ప్రజలు తేల్చి చెప్పారు.
పవన్.. నీకు సిగ్గు, నైతికత ఉందా?
పవన్ నిన్న మీరు ఏమన్నారు. తెలుగుదేశం–జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నావ్. మరి బీజేపీ ఏమైంది?. బీజేపీతో కలిసి ఉన్నానంటావు. తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేస్తానని చెబుతున్నావ్. ఏమిటీ దౌర్భాగ్యం? నీ అంత అనైతికమైన వ్యక్తి, ఈ రాజకీయాల్లో చంద్రబాబు తర్వాత నువ్వే. మోస్ట్ అన్ రిలైబుల్ పొలిటీషియన్.. చంద్రబాబు తర్వాత ఎవరైనా ఉన్నారంటే.. అది నువ్వే.
బీజేపీతో పొత్తులో ఉన్నావు. దాని నుంచి బయటకు రాలేదు. టీడీపీతో వెళ్తున్నావు. నీకు అసలు సిగ్గుందా? నైతికత ఉందా?
బీజేపీ నాయకులు చెవుల్లో పూలు
బీజేపీ జాతీయ పార్టీ. దాని గుర్తు కమలం. ఆ పార్టీ నాయకుల చెవిలో కమలం కన్నా పెద్ద పువ్వు పెట్టాడు పవన్‌కళ్యాణ్. బీజేపీ నాయకులకు కూడా చెబుతున్నాను. మీ చెవిలో క్యాబేజీ, క్యాలిఫ్లవర్ పెట్టాడు. ఇది గుర్తించండి.
సైకిల్ సైనికులుగా మారొద్దు
పవన్‌కళ్యాణ్ రాజకీయ జీవితమే కాదు. వ్యక్తిగత జీవితం కూడా అంతే. ఎక్కడా ఆయనకు నిబద్ధత లేదు. అదే ఆయన నిత్య జీవితం. బీజేపీతో ఇంకా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయంటావు. టీడీపీతో కలిసి వెళ్తానంటావు. టీడీపీ–జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తుందంటావు. అసలు నీవు రాజకీయ నాయకుడివా. మళ్లీ చెబుతున్నాను. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్‌కళ్యాణ్. ఆయనను ఇంకా నమ్మితే జన సైనికుల ఖర్మ. మీరు జన సైనికులు కాదు. సైకిల్ సైనికులుగా మారొద్దు.
అంబాజీపేట ఆముదంతో సైకిల్ తుడువు
గ్లాస్‌తో మంచినీళ్లు తాగొచ్చట. సైకిల్‌తో ప్రయాణం చేయొచ్చట. కరెంటు లేకుంటే ఫ్యాన్ పని చేయదట.. పవన్ సినిమా డైలాగ్‌లతో ప్రచారం చేస్తున్నాడు. నీవు నమ్ముకున్న సైకిల్ పరిస్థితి ఏమిటి? ఇప్పటికే దానికి తుప్పు పట్టింది. టైర్లు లేవు.మొన్నీమధ్య నీ గ్లాస్ కూడా పోయింది. మొన్న ఎన్నికల సంఘం రెండో గ్లాస్ ఇచ్చింది. అందులో కొంత అంబాజీపేట ఆముదం, కాస్త మంచినూనె, కోనసీమ కొబ్బరినూనె వేసి.. బాగా తిప్పాలి. ఆ పని నువ్వు చేయలేవు కాబట్టి.. నీ చెంచా మనోహర్ ఉన్నాడు కదా. ఆయనను తిప్పమను. ఆ తర్వాత ఆ ఆయిల్‌ను తప్పు పట్టిన సైకిల్‌ను తుడువు. జైలు నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు దాన్ని తొక్కుతాడు. సిగ్గు, శరం లేనివాడివి నువ్వు. చంద్రబాబు చెప్పులు కూడా మోయడానికి సిద్ధపడ్డావ్. ఏమన్నా అంటే.. మా పార్టీ నాయకులు.. నిన్ను ప్యాకేజీ స్టార్ అంటున్నారని విమర్శిస్తావు. డబ్బంటే నాకు లెక్క లేదు. దాని గురించి నేను ఆశ పడడం లేదు. వైయస్సార్‌సీపీ వాళ్ళు నన్ను ప్యాకేజీ స్టార్ అంటున్నారు.. అంటున్నావ్.
ప్యాకేజీ కాకపోతే.. మరి ఎందుకు ఆ సపోర్ట్?
నువ్వు ప్యాకేజీ తీసుకోకపోతే.. డబ్బులు తీసుకోకపోతే... చాలా సిన్సియర్ అయితే... మరి చంద్రబాబుకు ఎందుకు సపోర్టు చేస్తున్నావ్. బాబు ఏమైనా నీతిమంతుడా? స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నాడా? లేకపోతే చెగువేరాతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నాడా? లోకేశ్ మీ అమ్మను తిట్టాడని ఆరోజు విమర్శించావ్. మరి ఇప్పుడు ఎందుకు సపోర్టు చేస్తున్నావ్? మీ అన్న పీఆర్పీ పెట్టినప్పుడు నువ్వు ఏదో యువరాజ్యమో, పిల్ల రాజ్యానికో ప్రెసిడెంట్‌గా ఉన్నావు కదా. అప్పుడు చంద్రబాబు మీకు సపోర్టు చేశాడా? ఓకే ప్యాకేజీ తీసుకోలేదు అంటున్నావు. మరి ఎందుకు సపోర్టు చేస్తున్నావ్. కారణం మేము చెప్పమంటావా..
బాబు చెప్పులు మోయడానికి కూడా సిద్ధపడ్డావ్
బాబు దగ్గర డబ్బులు తీసుకుని, ఆఖరికి అతని చెప్పులు మోయడానికి కూడా నీవు సిద్ధంగా ఉన్నావ్. చివరకు నీ వారాహికి కొట్టించే ఆయిల్ కూడా చంద్రబాబు అవినీతి డబ్బులే. చంద్రబాబు అవినీతి సొమ్ముతోనే నీ జెండా కూడా పని చేస్తోంది. అంతేతప్ప, చంద్రబాబు నీతిమంతుడు కాబట్టి నువ్వు సపోర్టు చేస్తున్నావని ప్రజలెవ్వరూ అనుకోవడం లేదు.
సర్వనాశనం అవుతున్న తెలుగుదేశం పార్టీ, భూస్థాపితం అవుతున్న టీడీపీ, అవినీతి, అక్రమాలతో నాశనం అవుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని బతికించాలన్న తాపత్రయం తప్ప.. అసలు నీలో ఏమైనా కనబడుతోందా?. నీ జనసైనికలకు ఏమైనా సందేశం ఇచ్చావా? 175లో మాకు 15 సీట్లు వస్తాయట. అంటే మిగిలినవన్నీ జనసేన, టీడీపీ సంకీర్ణానికి వస్తాయట. ప్రజల్లో ఏం ఉందో తెలుసుకుంటున్నావా? అవినీతిపరుడైన చంద్రబాబును సపోర్టు చేయడం ద్వారా నీవు కూడా గంగలో దూకబోతున్నావు. దానికి తార్కాణం నిన్నటి అవనిగడ్డ సభ. అక్కడ ప్రజలు నిన్ను ఛీకొట్టారు.
మా వ్యాక్సిన్ కు టీడీపీ-జనసేన ఠా
పవన్ ఇంకా ఏమన్నాడు. ఏదో వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టాడట. ఎప్పుడు కనిపెట్టావయ్యా ఆ వ్యాక్సిన్‌ను. ఎక్కడ ఈనాడు ల్యాబ్‌లోనా, ఆంధ్రజ్యోతి ల్యాబ్‌లోనా. చంద్రబాబుతో కలిసి ఎక్కడ ఆ వ్యాక్సిన్‌ను కనిపెట్టావ్. ప్రశ్నించడం మానేసి.. వ్యాక్సిన్‌లు కనిపెట్టావా? మొన్న వేశాం కదా వ్యాక్సిన్‌లు. నీవు ఠా. నీవు స్వయంగా ఓడిపోయావు. తెలుగుదేశం 23 సీట్లకే పరిమితం అయింది. ప్రజలు వేసిన వ్యాక్సిన్‌ను అడ్డంగా పడిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన కలిసి మ్యుటేషన్ అయి, కలిసి వస్తున్నారు. కొత్త వైరస్ తయారై వస్తోంది. ఇది మరింత బలహీనమైన వ్యాక్సిన్. పవన్, చంద్రబాబు ఎక్కడ నిలబడినా ఓటమి తప్పదు. వైయస్ జగన్‌కి 175కు, 175 సీట్లు వస్తాయి. పవన్.. నీవు ఇప్సటికైనా, బందరు సభలో అయినా ఒక క్లారిటీ ఇవ్వు. ఎవరితో ఉన్నావ్. బీజేపీతో ఉన్నావా? విడాకులు తీసుకున్నావా?
ఇవి చెప్పకుండా.. నేను నిజాయితీపరుడ్ని అంటున్నావ్.
నాడు టీడీపీ ఎన్ని ఘోరాలు చేసినా ప్రశ్నించావా..
ఈసారి తప్పు జరిగితో ఊర్కోను. పొట్లాడుతా అంటున్నాడు. ఒకసారి అయిపోయింది. 2014లో సపోర్టు చేసి, టీడీపీ ఎన్ని ఘోరాలు చేసినా, 5 ఏళ్లు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాన్ని జన సైనికులే అడుగుతున్నారు కాబట్టి, ఈసారి తప్పులు చేస్తే ఊర్కోబోనని చెబుతున్నావు. అలా అడుక్కునే దశకు దిగజారిపోయావు. ఆ స్థాయికి దిగజారాటానికి సిగ్గు నీకు ఎక్కడ లేదు...
బాబు ప్యాకేజీ సొమ్ము భద్రం..?
ప్రజలు ఎప్పటికీ తప్పు చేయరు. సీఎం వైయస్ జగన్‌ని మళ్లీ గెలిపిస్తారు. ఇంకా నీపై కేసులు పెడతారని అంటున్నావు. తప్పు చేయకపోతే కేసులు ఎందుకు పెడతారు? తప్పు చేస్తే పెడతారు. జాగ్రత్తగా చూసుకో. చంద్రబాబు అవినీతి సొమ్ము నీ ఖాతాలోనో, మనోహర్ ఖాతాలోనో.. లేక నీ బంధువుల ఖాతాలో పడిందేమో చూసుకొండి. పవన్ బీరాలు పోకండి. చంద్రబాబు, నీవు కలిసి వచ్చినా, బీజేపీ చెవిలో పూవు పెట్టినా.. ఏం కాదు. మీరు సమష్టిగా ఓడిపోతున్నారు. సీఎం వైయస్ జగన్ 175 సీట్లతో రాజ్యాధికారానికి రాబోతున్నారు. అందుకే తెలుసుకుని మాట్లాడాలి.
పవన్ ఏం చెప్పినా రివర్స్..
పవన్ మొన్న ఏమన్నాడు. వైయస్ జగన్ అధికారంలోకి రాడు అన్నాడు. కానీ ఏం జరిగింది. పవన్ ఏం చెప్పినా రివర్స్ అవుతుంది. పవన్‌వన్నీ పిచ్చి వాగుడే. పవన్ మాటలు. యదార్థాలు చూస్తే.. అన్నీ అర్ధం అవుతాయి. అప్పుడప్పుడు వచ్చి పాఠాలు వింటే ఏం జరుగుతుంది. షూటింగ్ విరామంలో వచ్చి, రాజకీయాలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. చంద్రబాబు చెప్పిన మాటలు చెబితే ఇలాగే ఉంటుంది.
మీ దత్తతండ్రిని అడుగు..
ఓట్లు కొనడానికి డబ్బులు లేవు అంటున్నావు. చంద్రబాబు ఇస్తాడు కదా. నీవు ఓట్లకు డబ్బులు ఇచ్చినా, నీవు గెల్చేది లేదు. నీకు మళ్లీ ఓటమి తప్పదు. తన దగ్గర డబ్బు లేవనడం ఏమిటి? సినిమా యాక్టర్. సినిమాకు కోట్లకు కోట్లు తీసుకుంటాడు. ఇంకా చంద్రబాబు ఉన్నాడు. దోచుకున్న డబ్బు ఇవ్వడానికి. అందుకే జైలుకు పోయినప్పుడు చంద్రబాబును అడగమనండి. అంతేకానీ, బహిరంగ సభలో చెప్పడం ఎందుకు?
పవన్ రాజకీయాలకు పనికిరాడు..
మమ్మల్ని అతడు కాపాడడం ఏమిటి? పిచ్చి వాగుడు. పవన్ ఏదో మైకంలో, ఊహా ప్రపంచంలో ఉన్నాడు. కాసేపు అమాయకుడిలా కనిపిస్తాడు. మళ్లీ చెబుతున్నాను. నూటికి నూరుపాళ్లు పవన్‌కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు. ఆయనను నమ్మి ఎవరు వెళ్లినా, కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లే..
అసలైన గ్రామ స్వరాజ్యం ఇప్పుడే..
గ్రామ స్వరాజ్యం. ఈరోజు వాస్తవంగా కనిపిస్తోంది. గ్రామాల్లో ఇంటి గడప వద్తే అన్నీ అందుతున్నాయి. గ్రామం ఒక యూనిట్‌గా ప్రజలకు ఇంటి వద్దకే సేవలు అన్నీ అందుతున్నాయి. వారికి అవసరమైన సర్టిఫికెట్లు కూడా గ్రామంలోనే అందుతున్నాయి. అందుకే మహాత్మాగాంధీ ఆశయాలు కార్యరూపం దాల్చే శక్తి ఒక్క వైయస్ జగన్‌కే ఉంది. అందుకే ఆయనే మళ్లీ సీఎం అవుతారు.
పాపం పండే బాబు జైల్లో..
మేము కౌరవులం అయితే.. పవన్ ఏమిటి? ఏమిటా పిచ్చి మాటలు? అది అవినీతిపరుల దీక్ష. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా చేస్తున్న ఒక అనైతిక దీక్ష. దేశ రాజకీయాలను అవినీతిమయం చేసింది చంద్రబాబు కాదా? దేశాన్ని, రాష్ట్రాన్ని అవినీతిమయం చేసింది చంద్రబాబు కాదా? ఎన్నికల ఖర్చును విపరీతంగా పెంచింది, ఓట్లు కొనడం మొదలు పెట్టింది చంద్రబాబు కాదా? అధికారం కోసం వందల, వేల కోట్లు ఖర్చు చేసి, అధికారంలోకి వచ్చాక, అంతకు అంత సంపాదించడం చంద్రబాబుకు అలవాటు. ఇవాళ ఆయన పాపం పండింది. అందుకే జైలులో ఉన్నాడు. గాంధీ జయంతి రోజున, అవినీతిపరులు దీక్షలు చేయడం చాలా దురదృష్టకరం. అధికారం నాకు శాశ్వతం కాదు అంటున్న పవన్, మరి తెలుగుదేశంతో కలిసి ఎందుకు వెళ్తున్నాడు? మనోహర్ రాజకీయ జీవితం చూస్తే అత్యంత దారుణం. 2004లో ఆయన తెనాలిలో ఏకంగా దుకాణం తెరిచి, మొత్తం కుటుంబ సభ్యులు దోపిడి చేశారు. ఇప్పుడు మళ్లీ అక్కడ పోటీ.. అంటూ మరోసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.