మంత్రుల సంతాపం

అమ‌రావతి: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం పట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌లువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.  మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణ వార్త కలచివేసిందని మంత్రి తానేటి వనిత అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని పార్థిస్తున్నాన్నారు.

►గౌతమ్‌రెడ్డి మృతి పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి కోసం గౌతమ్‌రెడ్డి నిరంతరం శ్రమించారన్నారు.

►గౌతమ్‌రెడ్డి మృతి పట్ల మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యుడిలా గౌతమ్‌రెడ్డి ఉండేవారన్నారు. గౌతమ్‌రెడ్డి మరణం పార్టీ, ప్రజలకు తీరని లోటన్నారు.

►మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పట్ల మంత్రి బొత్స సత్యనారాయణ దిగ్భాంతి వ్యక్తం చేశారు.

Back to Top