వైయ‌స్ఆర్‌సీపీలోకి మహేష్‌బాబు అభిమాన సంఘం

 నెల్లూరు : నగరంలోని ప్రముఖ సినీ నటుడు మహేష్‌బాబు అభిమానుల సంఘం అధ్యక్షుడు సురేష్‌ ఆధ్వర్యంలో సుమారు 500 మంది వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నెల్లూరులోని నర్తకి సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి ఆదాల ప్రబాకర్‌రెడ్డి, నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా అబిమాన సంఘం బైక్‌ ర్యాలీ నిర్వహించగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంబించారు. ఆదాల మాట్లాడుతూ కొన్ని రోజులుగా వందలాది మంది వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. తొలుత ఆదాల ప్రభాకర్‌రెడ్డిని, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, వైవీ రామిరెడ్డి, మల్లు సుధాకర్‌రెడ్డి, స్వర్ణ వెంకయ్య పాల్గొన్నారు. ఈ బైక్‌ ర్యాలీ నర్తకి సెంటర్‌ నుంచి నగరంలో నిర్వహించారు.    

 

Back to Top