నెల్లూరు: తిరుపతి పార్లమెంట్‌కు జరగబోతున్న ఉప ఎన్నికకు వైయస్‌ఆర్‌సీపీ తరఫున డాక్టర్ గురుమూర్తి కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సెంటర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వేలాది మంది పార్టీ శ్రేణులు వెంట రాగా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలతో కలిసి గురుమూర్తి నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈ రోజు తిరుపతి పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తున్నానని చెప్పారు. ఎన్నికలో ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తన గెలుపునకు ఉపయోగపడుతాయని చెప్పారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , నారాయణ స్వామి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి మేకపాటి గౌతమ్ రెడ్డి , అనిల్ కుమార్ యాదవు , ఆది మూలపు సురేష్, కొడాలి నాని ,చీఫ్ విప్ గడి కోట శ్రీకాంత్ రెడ్డి, విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లోక్ సభ పరిధిలోని ఎం ఎల్ ఏ లు సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, వెంకటగిరి ఆనం రామ నారాయణ రెడ్డి, తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన రెడ్డి, గూడూరు వర ప్రసాద్, సూళ్లూరుపేట కె సంజీవయ్య, సత్యవేడు ఆది మూలం గార్ల తో కలసి ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ కార్యాలయం లో రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేశారు.మద్దిల గురుమూర్తి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ తో నెల్లూరు నగరం రోడ్లు జనం తో క్రిక్కరిసాయి. డప్పులు మోత, బాణా సంచా కాలుపులతో సందడి నెలకొంది. తిరుపతి ఉప ఎన్నికకు గురుమూర్తి నామినేషన్ దాఖలు