జాషువా జీవితం ఆదర్శనీయం

సీఎం క్యాంపు కార్యాలయంలో గుర్రం జాషువా పురస్కారాల ప్రదానం
 
సీఎం క్యాంపు కార్యాలయంలో జాషువా జయంతి   

తాడేపల్లి:  నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జీవితం నుంచి నేటి యువత నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మహాకవి గుర్రం జాషువా జయంతి వేడుకలను అధికార భాషా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్రం జాషువా పేరిట ఇచ్చిన పురస్కారాలను డాక్టరు కత్తి పద్మారావు, బోయి హైమావతి, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, ఆచార్య చందు సుబ్బారావు అందుకున్నారు.ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, సాంఘిక దురాచారాలపై గుర్రం జాషువా అలుపెరగని పోరాటం చేశారని, సమాజంలోని అంతరాలను దూరం చేసేందుకు ఆయన కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ప్రముఖ సినీ హాస్యనటుడు బ్రహ్మానందం, ఎంపీ నందిగం సురేశ్  పలువురు కవులు, రచయితలు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top