విశాఖ‌లో ప్ర‌ధానికి ఘ‌న స్వాగ‌తం

న‌రేంద్ర మోదీకి  స్వాగతం పలికిన గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం వైయ‌స్ జగన్  
 

విశాఖ‌:  రాష్ట్ర ప‌ర్య‌ట‌న నిమిత్తం విశాఖ‌కు వ‌చ్చిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌, సీఎం వైయ‌స్‌ జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి విడదల రజిని స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని.. చోళ (నౌకా దళానికి చెందిన గెస్ట్‌ హౌస్‌)కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు(శనివారం) ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగసభ నిర్వహంచనున్నారు. ప్రధాని మోదీ సభావేదికపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ మాత్రమే ఉంటారు. రేపటి సభలో 40 నిమిషాల పాటు ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.  

 

Back to Top