ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం

మంత్రులు కన్నబాబు, పేర్ని నాని

కృష్ణా: పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని మంత్రులు కన్నబాబు, పేర్ని నాని అన్నారు. మచిలీపట్నంలో జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో వారు పాల్గొని వైయస్‌ఆర్‌ రైతు భరోసా, అర్హులందరికీ ఇళ్లు, ఇసుక కొరత వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. టీడీపీ నేతలు బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. దీక్షల పేరుతో ప్రజలను తప్పుదోవపట్టించి సానుభూతి పొందాలని టీడీపీ నేతలు చూస్తున్నారన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, నూతన ఇసుక పాలసీతో అక్రమాలకు చెక్‌పెట్టామన్నారు. 
 

Back to Top