విద్యారంగంలో ఏపీ కృషి అమోఘం

 జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ జీఎం రావు  

విశాఖ‌:  విద్యారంగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కృషి ఆమోఘ‌మ‌ని జీఎంఆర్ గ్రూప్ చైర్మ‌న్ జీఎం రావు కొనియాడారు. అమ్మ ఒడి, విద్యా కానుక‌, విద్యా దీవెన‌, విదేశీ విద్యా దీవెన ప‌థ‌కాల ద్వారా ప్ర‌జ‌లు ల‌బ్ధి పొందుతున్నార‌ని చెప్పారు. విశాఖ‌లో నిర్వ‌హించిన గ్లోబ‌ల్  ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌లో జీఎం రావు మాట్లాడారు. ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ విజ‌న్ అద్భుత‌మ‌న్నారు. సీఎ వైయ‌స్ జగన్‌ దార్శనికత ప్రశంసనీయమ‌న్నారు.ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింద‌ని చెప్పారు. రాష్ట్ర‌ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఏపీలో ఇన్వెస్టర్స్‌ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్‌ ఉందన్నారు. ఎయిర్‌ కనెక్టివిటీ పెరుగుతండటంతో ఏపికి మరిన్ని పరిశ్రమలు వ‌స్తాయ‌న్నారు. రాష్ట్ర జీడీపీ సుస్థిరంగా ఉండటం ప్రశంసనీయమ‌ని అభినందించారు.

Back to Top